పవిత్రమైన దేవాలయాన్ని కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ ప్రేమ జంట తమ కామవాంఛలు తీర్చుకునే అడ్డాగా మార్చుకుంది. కొన్నిరోజులుగా సాగుతున్న ఈ తంతు చివరకు గ్రామస్తుల కు తెలియడంతో బయటకి వచ్చింది. ఈ ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా కృష్ణాపుర గ్రామంలో చోటు చేసుకుంది. కళ్లల గ్రామానికి చెందిన యువతీ యువకుడు ప్రేమలో మునిగారు. రోజూ దేవాలయం మూసి ఉన్న సమయంలో బైక్‌పై చేరుకునేవారు.
మొదట్లో ఊరికే షికారు కోసం అలా వస్తున్నారేమో అని గ్రామస్తులు భావించారు. కానీ నిత్యం అదే సమయానికి దేవాలయానికి వస్తుండడంతో బుధవారం అనుమానంతో ఆ దేవాలయానికి దారితీశారు. అప్పటికే ఆ యువజంట ఆలయం ఆవరణలో కామకలాపాల్లో నిమగ్నమైంది. గ్రామస్థులు దగ్గరగా రావడాన్ని కూడా గమనించలేనంతగా యువజంట శృంగారంలో తలమునకలయ్యారు. కొద్దిసేపటికి గ్రామస్థులు తమను గమనిస్తున్నట్లు తెలుసుకున్న యువజోడి వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి యత్నించగా పట్టుకుని ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించి వదిలేశారు.