మా అసోసియేషన్ లో వివాదం రగిలింది. అధ్యక్ష పదవికి పోటీచేస్తూ, తనే కోరి మరీ తెచ్చుకున్నారు జీవిత ఇంకా రాజశేఖర్ లను సీనియర్ నటుడు నరేష్. ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య వివాదాలు రాజుకున్నాయి. సమస్య ఏమిటీ అంటే జీవిత రాజశేఖర్ చెబుతున్నవి ఇప్పటికే అందరికీ తెలిసాయి. సంస్థ దగ్గర నిధులు అడుగు అంటుతున్నాయి. ఫండ్ రైజింగ్ సంగతి నరేష్ మాట్లాడడం లేదు. ఖర్చులు వున్నాయి అన్నది కీలకమైన పాయింట్ గా వుంది.
డబ్బుల సమస్య లేదు. ఇంకా ఫండ్స్ వున్నాయి. ఆరునెలల్లో రెండు లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ మూడు లక్షలు చేసాం. మరణించిన వారి కుటుంబాలకు మూడేసి లక్షల వంతున అందించాం. ఎప్పుడూ లేని కార్యక్రమాలు మూడు నెలల్లో చేసేసాం అన్నది నరేష్ వర్గం మాటగా వుంది. నరేష్ ఒంటెద్ది పోకడపోతున్నారని, గెలిచిన తరువాత కూడా తన వర్గం, శివాజీరాజా వర్గం అన్నట్లు వేరు వేరుగా చూస్తున్నారన్నది జీవిత వర్గం వాదనగా వుంది.
నరేష్ వ్యతిరేక వర్గం ఏ ప్రతిపాదన చేసినా, నరేష్ పట్టించుకోవడం లేదని అంటున్నారు. తెరవెనుక మాత్రం చాలా వ్యవహారాలు వున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహణ విషయంలోనే జీవిత రాజశేఖర్ కు, నరేష్ కు మధ్య విబేధాలు పొడసూపినట్లు తెలుస్తోంది. చిత్రమేమిటంటే గతంలో వున్న కార్యవర్గం విషయంలో కూడా ఇదే ఫండ్ రైజింగ్ కార్యక్రమం మీదనే ఆరోపణలు, విమర్శలు వినిపించాయి.
ఇప్పుడు గతంలో ఏ సంస్థ అయితే అమెరికాలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిందో అదే సంస్థ, అన్నీ క్లియర్ గా ట్రాన్స్ పెరెంట్ గా వుండేలా ఏర్పాట్లు చేసి, సర్టిఫైడ్ ఆడిటింగ్ నిర్వహిస్తూ, రెండు కోట్లు ఇవ్వడానికి నరేష్ ముందుకు వచ్చిందని, దానికి నరేష్ బ్యాకింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో శివాజీరాజా వర్గంపై ఏ సంస్థ కారణంగా, ఏ ఫండ్ రైజింగ్ కారణంగా ఆరోపణలు చేసారో, ఆ సంస్థనే ఇప్పుడు నరేష్ సపోర్ట్ చేస్తున్నారని, అక్కడే అసలు సమస్య స్టార్ట్ అయిదని తెలుస్తోంది.