Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన కేసులో టీవీ యాంకర్ ప్రదీప్ కి కోర్టు శిక్ష వేసింది. చేసిన తప్పుని ఒప్పుకోడానికి నిర్ణయించుకున్న ప్రదీప్ లాయర్ ని కూడా పెట్టుకోకుండానే కోర్టుకు వచ్చారు. తప్పు అని తెలిసి కూడా తాగి ఎందుకు డ్రైవింగ్ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు తప్పు చేసినట్టు ప్రదీప్ ఒప్పుకున్నారు. దీంతో న్యాయమూర్తి ప్రదీప్ కి 2100 జరిమానాతో పాటు మూడేళ్ళ పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు.
కోర్టు తీర్పుతో ప్రదీప్ జైలుశిక్ష లేకుండా బయటపడినందుకు సంతోషంగా బయటకు వచ్చాడు. అంతకు ముందు కోర్టులో ఇక ఇలాంటి తప్పు చేయబోనని న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. మొత్తానికి మీడియాలో ఎంత రచ్చ జరిగినా జైలు శిక్ష లేకుండా తప్పుంచుకున్న ప్రదీప్ అదృష్టవంతుడే. కాకుంటే మూడేళ్ళ పాటు ఇక కారు డ్రైవ్ చేసే అవకాశం మాత్రం ఉండదు.