Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ పండుగ వచ్చినా కూడా టాలీవుడ్‌లో సందడి అదే స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి, దసరా పండుగలకు స్టార్ హీరోల సినిమాలు రెండు మూడు విడుదల కావడం పరిపాటి. ఇక తాజాగా దసరా సందర్బంగా కూడా ప్రేక్షకుల ముందుకు మూడు సినిమాలు వచ్చాయి. మూడు సినిమాల్లో మొదటగా ‘జై లవకుశ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. కథ సింపుల్‌గా ఉన్నా ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించి సూపర్బ్ అనిపించుకున్నాడు. ఆ చిత్రం ఇప్పటికే 160 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ‘జైలకువశ’ విడుదలైన వారం రోజుకు మహేష్‌బాబు ‘స్పైడర్’ చిత్రం విడుదలైంది. మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘స్పైడర్’ చిత్రానికి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది.
భారీ కలెక్షన్స్‌ను సాధిస్తుందని భావించిన స్పైడర్ చిత్రం సాదా సీదా కలెక్షన్స్‌ను రాబడుతుంది. తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళంలో విడుదలైనా కూడా అంతంత మాత్రంగానే స్పైడర్ కలెక్షన్స్ ఉన్నాయి. లాంగ్‌రన్‌లో ఈ చిత్రం 50 నుండి 60 కోట్ల షేర్‌ను సాధించే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. స్పైడర్ చిత్రం తర్వాత ‘మహానుభావుడు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్, మరుతి కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్ నటించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ టాక్ దక్కింది. ముందుగా వచ్చిన జైలవకుశ మరియు స్పైడర్ చిత్రాల కంటే మహానుభావుడు చాలా బాగున్నాడు అంటూ టాక్ వస్తుంది.
దసరాకు కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే జైలవకుశ చిత్రం విజేతగా నిలిచినట్లుగా భావించవచ్చు. టాక్ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మహానుభావుడు సినిమా దసరా విన్నర్‌గా పేర్కొనవచ్చు. మొత్తానికి స్పైడర్‌పై జైలవకుశ మరియు మహానుభావుడు చిత్రం పై చేయి సాధించాయి. మహానుభావుడు మెల్ల మెల్లగా కలెక్షన్స్ జోరును పెంచుకుంటున్నాడు. కాస్త ముందు వచ్చి ఉంటే కలెక్షన్స్ మరింత ఎక్కువగా ఉండేవి. లాంగ్ రన్‌లో మహానుభావుడు 40 నుండి 50 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.