కల్కి మూవీ వచ్చేవరకు ‘మహారాజ’దే బాక్సాఫీస్ !

'Maharaja' is the box office till the Kalki movie comes!
'Maharaja' is the box office till the Kalki movie comes!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన 50వ మూవీ మహారాజ. ఈ తమిళ మూవీ ప్రస్తుతం తెలుగు నాట దుమ్ము దులుపుతుంది . వైజాగ్ లాంటి చిన్న ఏరియాలో కూడా కోటి రూపాయల కలెక్షన్లని రాబట్టింది. అలాగే, నైజాంలో అయిదున్నర కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిందని తెలుస్తుంది . దాదాపు అన్నీ ఏరియాల్లో ఈ మూవీ కి మంచి కలెక్షన్సే వస్తున్నాయి. పైగా కల్కి మూవీ రిలీజ్ రోజు వరకూ ఈ మూవీ కి ఇలాగే భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది .

'Maharaja' is the box office till the Kalki movie comes!
‘Maharaja’ is the box office till the Kalki movie comes!

కాబట్టి, కల్కి మూవీ వచ్చేవరకు ‘మహారాజ’దే బాక్సాఫీస్ అనుకోవచ్చు. మొత్తానికి ఈ మూవీ జూన్ 14, 2024న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని , అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా, విజయ్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ లో అనురాగ్ క‌శ్య‌ప్, మ‌మ‌తా మోహ‌న్ దాస్, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల ల్లో న‌టించారు. మొత్తానికి ఈ మూవీ తో విజ‌య్ సేతుప‌తికి మళ్లీ భారీ హిట్ దక్కింది.