ఉస్మానాబాద్, ఔరంగాబాద్ జిల్లాల పేర్లు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం..!

Maharashtra government has changed the names of Osmanabad and Aurangabad districts..!
Maharashtra government has changed the names of Osmanabad and Aurangabad districts..!

మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఉస్మానాబాద్, ఔరంగాబాద్ జిల్లాల పేర్లను మార్చుతూ ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని నెలల కిందట నుంచి ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని సబ్ డివిజన్, గ్రామ, తాలుకా జిల్లా స్థాయిలో పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.

కొత్త ఉత్తర్వుల ప్రకారం ఔరంగాబాద్ జిల్లా ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాగా, ఉస్మానాబాద్ జిల్లా ధారాశివ్ జిల్లాగా మారిపోయింది. ఇక నుంచి అధికారికంగా ఆయా పేర్లతోనే పిలవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర, ప్రత్యుత్యారాలలో, అధికారిక కార్యక్రమాల్లో ఇక నుంచి శంభాజీనగర్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లు కనిపించనున్నాయి. వాస్తవానికి షిండే, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల తిరుగుబాటుతో గతేడాది జూన్ 29న అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడానికి ముందు జరిగిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ చివరి మంత్రివర్గ సమావేశంలో ఉస్మానాబాద్, ఔరంగాబాద్ పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు