చంద్రబాబు అరెస్ట్ తరువాత ఎన్టీఆర్ దుబాయ్ కి ఎందుకు వెళ్లాడో తెలుసా ?

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఎన్టీఆర్ దుబాయ్ కి ఎందుకు వెళ్లాడో తెలుసా ?
Latest News , entretainment

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు దుబాయ్ లో అట్టహాసంగా ప్రారంభమైన విషయం మనకి తెలిసిందే. 2023 ఏడాదికి గాను దక్షిణాదిలో రాణించి.. ఉత్తమ ప్రదర్శన చూపించిన నటీనటులు బెస్ట్ అవార్డులను కూడా అందుకున్నారు. ముఖ్యంగా ఈ అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది . సైమా అవార్డుల్లో ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. శుక్రవారం రాత్రి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అవార్డులు వేడుక జరిగింది.

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఎన్టీఆర్ దుబాయ్ కి ఎందుకు వెళ్లాడో తెలుసా ?
Chandra Babu, NTR

ఈ వేడుకలో పలువురు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీ, నటులు కూడా పాల్గొన్నారు. సైమా 2023 వేడుకలో ఉత్తమ నటుడి కేటగిరిలో ఎన్టీఆర్ తో పాటు అడివిశేషు, దుల్కర్ సల్మాన్, నిఖిల్ సిద్ధార్థ, రామ్ చరణ్, సిద్దూ జొన్నలగడ్డ కూడా పోటీ పడ్డారు. మేజర్ సినిమా కి అడివి శేషు, ఆర్ఆర్ఆర్ సినిమా కి రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాకి, నిఖిల్ సిద్దార్థ కార్తికేయ2, డీజే టిల్లు సినిమా కోసం సిద్దూ జొన్నల గడ్డ రేసులో ఉండటంతో ఫైనల్ గా RRR మూవీలో కొమురం భీముడి పాత్రలో అద్భుత నటనను కనబరిచిన ఎన్టీఆర్ కి సైమాలో ఉత్తమ నటుడిగా ఎంపిక చేశారు.

సైమా 2023 వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ల కిందట పాల్గొన్నారు. 2017లో జనతా గ్యారెజ్ సినిమా కి ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఈసారి RRR సినిమా ద్వారా ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు. అందుకోసమే ఎన్టీఆర్ దుబాయ్ కి కుటుంబంతో కలిసి వెళ్లారు. సైమా అవార్డుల్లో ఉన్న ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఎన్టీఆర్ స్పందించకుండా కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లారు. అని రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా ఎన్టీఆర్ కి సైమా అవార్డు రావడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఇండియాకి వచ్చిన తరువాత చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందిస్తాడో లేదో వేచి చూడాలి మరీ.