సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యవసాయం చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అది కూడా మామూలు రెగ్యులర్ వ్యవసాయం కాకుండా సేంద్రీయ వ్యవసాయం చేయబోతున్నాడు. దీపావళి తర్వాత వ్యవసాయంకు సంబంధించి రంగంలోకి దిగబోతున్నాడు. అయితే అది రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్ కోసం మహేష్ వ్యవసాయం చేయబోతున్నాడు. మొన్నటి వరకు అమెరికాలో షూటింగ్ జరుపుకుని వచ్చిన మహర్షి చిత్రాన్ని త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు. అమెరికాలో పెద్ద కంపెనీ అధినేతగా కనిపించిన మహేష్‌బాబు ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ కోసం రైతులా మారబోతున్నాడు. మహేష్‌బాబు కెరీర్‌లో 25వ చిత్రం అయిన మహర్షి చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంను విభిన్నమైన కథాంశంతో దర్శకుడు వంశీ పైడిపల్లి రెడీ చేశాడు.
విభిన్న గెటప్స్‌లో మహేష్ బాబు ఈ చిత్రంలో కనిపిస్తాడని సమాచారం అందుతుంది. స్టూడెంట్‌గా, బిజినెస్ మెన్‌గా రైతుగా కూడా మహేష్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. అమెరికా నుండి తన స్నేహితుడు అయిన అల్లరి నరేష్ కోసం ఒక పల్లెటూరుకు మహేష్ వస్తాడట. ఆ పల్లెటూరు సెట్‌ను ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేస్తున్నారు. సెట్టింగ్‌ను అద్బుతంగా తీర్చి దిద్దడంతో పాటు, చాలా సన్నివేశాలను అక్కడ చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెట్ నిర్మాణం జరుగుతుంది.
దీపావళి తర్వాత సినిమా చిత్రీకరణ తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఆ షెడ్యూల్‌లో మహేష్‌బాబుతో కలిసి అల్లరి నరేష్ కూడా పాల్గొనబోతున్నాడు. వీరిద్దరు కలిసి సేంద్రీయ వ్యవసాయ విధానాలను ఊర్లో ప్రజలకు తెలియజేస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.