ఎమ్‌బి మల్టీప్లెక్స్‌ పనులు మొదలు…!

Mahesh Babu Multiplex Business

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు టాలీవుడ్‌లోనే అత్యధికంగా సంపాదిస్తున్న హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోర్బ్స్‌ జాబితాలో కూడా మహేష్‌బాబు పలు సార్లు స్థానం దక్కించుకున్న విషయం తెల్సిందే. సినిమాలతో పాటు పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం, సినిమాల నిర్మాణం ఇంకా స్టూడియో ద్వారా వచ్చే ఆధాయంతో మహేష్‌బాబు ఆస్తుల పరంగా కూడా టాప్‌లో కొనసాగుతూ వస్తున్నాడు. భారీ ఎత్తున ఈయన సంపాదిస్తున్న మొత్తంతో అమరావతిలో మరియు వైజాగ్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక మహేష్‌బాబు తాజాగా కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు సిద్దం అయ్యాడు.

maheshbabu

హైదరాబాద్‌లోని ఖరీదైన ఏరియా అయిన గచ్చిబౌలిలో ఒక భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఏషియన్‌ సినిమాస్‌ సంస్థతో కలిసి మహేష్‌బాబు ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. వచ్చే ఏడాది చివర్లో కాని 2020లో కాని అది ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారీ ఎత్తున ఖర్చు చేసి, విదేశాల్లోని మల్టీప్లెక్స్‌ స్థాయిలో దాన్ని నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మల్టీప్లెక్స్‌తో పాటు షాపింగ్‌ మాల్స్‌కు కూడా స్పేష్‌ను దాంట్లో ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మహేష్‌బాబు కొత్త బిజినెస్‌లోకి ఎంటర్‌ అవ్వడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

maheshbabu-movies-business