శివాజీ రాజా బ్రోకర్‌, రౌడీ…

sri reddy comments on shivaji raja

‘మా’లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో శ్రీరెడ్డి వ్యవహారం కూడా బయటకు వస్తుంది. నరేష్‌ మీడియాతో మాట్లాడిన సందర్బంగా శ్రీరెడ్డి బ్యాన్‌ విషయంలో ఏకాభిప్రాయంతో వ్యవహరించలేదు, సొంతంగా బ్యాన్‌ విధించడం, ఆ వెంటనే బ్యాన్‌ను ఎత్తి వేయడం జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తాజాగా ఫేస్‌బుక్‌ ద్వారా శ్రీరెడ్డి స్పందించింది. ప్రస్తుతం మా లో జరుగుతున్న పరిణామాలపై ఆమె సోషల్‌ మీడియా ద్వారా తనదైన శైలిలో స్పందించి అందరికి షాక్‌ ఇచ్చింది. నేను కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంటే దాన్ని ఫేక్‌ అని, పబ్లిసిటీ కోసం అంటూ శ్రీకాంత్‌ మరియు శివాజీ రాజాలు అన్నారు. అందుకే ఇప్పుడు వారి గోచి ఊడిపోయే పరిస్థితి వచ్చింది.

sri-reddy

శ్రీరెడ్డి ఇంకా ఫేస్‌బుక్‌లో.. తాను మోసపోయి మా పెద్దల వద్దకు వెళ్తే వారు నాతో ప్రవర్తించిన తీరు అమానుశం. సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద కుటుంబాలను కాపాడే ప్రయత్నం చేశారు. నాకు కోట్లు ఇచ్చి ఓదార్చే ప్రయత్నం చేసి బ్రోకర్‌గా వ్యవహరించారు. కాని నేను అందుకు ఒప్పుకోలేదు. దాంతో రౌడీల మాదిరిగా ప్రవర్తించి నాపై దాడికి కూడా ప్రయత్నించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆడపిల్లలను కాల్చుకు తినే శివాజీ రాజా ఎన్నో సెటిల్‌మెంట్‌లు కూడా చేశాడు అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై శివాజీ రాజా ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి. కేవలం శివాజీ రాజాపై మాత్రమే కాకుండా మా సభ్యులందరిపై కూడా తీవ్ర స్థాయిలో ఈమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నిదుల గోల్‌మాల్‌లో ఒక స్టార్‌ హీరో హస్తం కూడా ఉందనే అనుమానాలను శ్రీరెడ్డి వ్యక్తం చేసింది.

sri-reddy