Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మూడు సంవత్సరాల క్రితం దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక స్టోరీతో సూపర్ స్టార్ మహేష్‌బాబును కలవడం జరిగింది. ఆ సమయంలో కథ చాలా బాగుందని చెప్పిన మహేష్‌బాబు డేట్లు ఇచ్చేందుకు కాస్త సమయం కావాలని అడిగాడు. దాదాపు రెండు సంవత్సరాలు ఎదురు చూసిన శేఖర్ కమ్ముల అదే కథను నిర్మాత దిల్‌రాజు ముందు ఉంచాడు. కథ నచ్చడంతో వెంటనే నిర్మించేందుకు దిల్‌రాజు సిద్దం అయ్యాడు. ఈ కథకు మెగా హీరో వరుణ్ తేజ్ అయితే బాగుంటుందనే అభిప్రాయంను దిల్‌రాజు వ్యక్తం చేశాడు. శేఖర్ కమ్ముల కూడా వరుణ్ తేజ్‌తో ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు.
మహేష్‌బాబు వద్దకు వెళ్లిన ‘ఫిదా’ చిత్ర కథ చివరకు మెగా హీరో వరుణ్ తేజ్ వద్దకు వచ్చి ఆగింది. చాలా సంవత్సరాలుగా కమర్షియల్ సక్సెస్ కోసం పోరాటం చేస్తున్న వరుణ్ తేజ్‌కు ‘ఫిదా’ కమర్షియల్ సక్సెస్‌ను ఇచ్చింది. ఈ సినిమా మహేష్‌బాబు చేసి ఉంటే అంత బాగుండేది కాదు అని విశ్లేషకుల మాట. ఫిదా కథకు వరుణ్ తేజ్ సరిగ్గా సూట్ అయ్యాడు. శేఖర్ కమ్ముల తన మార్క్‌ను వదలకుండా ఆకట్టుకునే తన ట్రేడ్ మార్క్ సీన్స్‌తో మాస్ ఆడియన్స్‌కు కూడా నచ్చే విధంగా తెరకెక్కించాడు.
మరిన్ని వార్తలు