Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ మూవీ ఎల్లుండి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ కాంబినేషన్ తో పాటు హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్, సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ , 120 కోట్ల బడ్జెట్ ఈ సినిమా మీద అంచనాల్ని ఇంకా పెంచేసాయి. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు, మంజుల స్వరూప్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తుంటే రిలయన్స్, లైకా సంస్థలు ఈ సినిమా బిజినెస్ లో పాలుపంచుకున్నాయి.
2015 లో లాంఛనంగా మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2016 లో ప్రారంభం అయ్యింది. ఏప్రిల్ 12 , 2017 న ఈ సినిమా ఫస్ట్ లుక్, జూన్ 1 న టీజర్ రిలీజ్ అయ్యాయి. ఆ టీజర్ చూసినప్పటినుంచి ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి. ఇది ఓ ఇంటలిజెన్స్ ఆఫీసర్ కథ. మహేష్ తో నాని లాంటి సినిమా, పవన్ తో ఖుషీ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సూర్య ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.
జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైన స్పైడర్ ఆల్బం లో మొత్తం ఐదు పాటలు వున్నాయి. ఇప్పటికే రెండు మూడు పాటలు జనం నోళ్ళలో నానుతున్నాయి. అయితే ఈ సినిమా మ్యూజిక్ ఇచ్చిన హ్యారిస్ జయరాజ్ 11 సంవత్సారాల కిందట మహేష్ బాబు సైనికుడికి పని చేశారు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ స్పైడర్ తో ఆ లోటు భర్తీ చేసుకోవాలని హ్యారిస్ కసిగా పనిచేశాడు. ఇక మహేష్ కి బాగా కలిసి వచ్చిన శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమాకి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఎల్లుండి అంటే సెప్టెంబర్ 27 న తెలుగు,తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న స్పైడర్ మీద మహేష్ బాబు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు ఫలించాలని , స్పైడర్ సూపర్ హిట్ కావాలని ఆశిద్దాం.