‘లవ్‌స్టోరి’ పై మహేశ్‌ ప్రశంసలు

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్‌లో రిలీజ్‌ అయిన పెద్ద సినిమా ఇదే కావడంతో థియేటర్లకు ఆడియెన్స్‌ క్యూ కడుతున్నారు. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

శేఖర్‌ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఇక ఈ మూవీ సక్సెస్‌లో మ్యూజిక్‌ సైతం ప్రధాన పాత్ర పోషించింది. సినిమా విడుదలకు ముందే లవ్‌స్టోరీ పాటలు యూట్యూబ్‌లో దుమ్మురేపాయి. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సైతం లవ్‌స్టోరీ మూవీ టీంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలసిందే.

‘రెహమాన్ సార్ శిష్యుడు పవన్ మ్యూజిక్‌ సంచలనమని, రెహ‌మాన్ స‌ర్ గ‌ర్వ‌ప‌డే స‌మ‌యం’ ఇది అంటూ మహేశ్‌ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ ట్వీట్‌కి ఏ.ఆర్.రెహమాన్ స్పందించారు. ‘అవును మహేశ్‌. పవన్‌ సూపర్‌ టాలెంటెడ్‌ అండ్‌ హంబుల్‌. మేమందరం అతన్ని చూసి గర్వపడుతున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు.