తెలంగాణలో ఏర్పడిన రెండో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహమూద్ అలీకి హోంశాఖను కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇంకా పూర్తి స్థాయి కేబినెట్ ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి కాకుండా ప్రమాణం చేసి ఒకే ఒక్క మహమూద్ అలీ మాత్రమే. అయితే మహమూద్ అలీనే ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న సందేహం మాత్రం చాలా మందిలో వస్తోంది. తెలంగాణ మొదటి ప్రభుత్వంలో హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి ఉన్నప్పటికీ ఆయనకు తన శాఖపై కనీస అధికారం ఉందని ఎవరూ అనుకోలేదు. కనీసం కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేయలేరని అందరూ చెబుతూ ఉంటారు. ఇప్పుడు హోంమంత్రి అయిన మహమూద్ అలీ కూడా అంతే. ఆయన అంతకు ముందు డిప్యూటీ సీఎం హోదాలో రెవిన్యూ శాఖను చూసుకున్నారు అంటే చూసుకున్నారు. దాంట్లో ఆయన చేసిందేమీ లేదు. ఇప్పుడు కూడా హోంమంత్రి హోదాను ఆయన చూసుకుంటారు చేయడానికి ఏమీ ఉండదు. సాంకేతికంగా మైనార్టీకి హోంమంత్రి పోస్ట్ ఇచ్చారనే పేరు మాత్రం వస్తుంది. అయితే ఈ సమీకరణం మాత్రమే కాదని మహబూద్ అలీకి హోంమంత్రి పోస్ట్ ఇవ్వడం ఓవైసీ బ్రదర్స్ కోరిక అని చెబుతున్నారు. మజ్లిస్ ఈ ఎన్నికల్లో అవుట్ రైట్‌గా టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసింది. హంగ్ అంటూ వస్తే మజ్లిస్ ప్రభుత్వంలో భాగస్వామి అవుతుందని అక్బరుద్దీన్ హోం మంత్రి అవుతారని ఎన్నికలకు ముందే గుప్పుమంది. బహుశా హంగ్ వస్తే అదే జరిగి ఉండేదేమో ! రాలేదు కాబట్టి అవసరం రాలేదు కాబట్టి మజ్లిస్‌కు బదులుగా వారి చాయిస్ మహమూద్ అలీకి చాన్సిచ్చినట్లు తెలుస్తోంది. మహమూద్ అలీ కూడా పాతబస్తీకి చెందిన వ్యక్తే. కానీ ఆయన తన కుమారుడ్ని కూడా కార్పొరేటర్‌గా గెలిపించుకోలేరు. జనాన్ని మొబిలైజ్ చేయలేరు. అందుకే… మజ్లిస్ తాము కాకపోతే ఆయన అని ఓకే చేసింది. ఇప్పుడు మహమూద్ అలీ చేతిలో హోంశాఖ ఉన్నా పాతబస్తీ వరకూ పెత్తనం చేసేది అక్బరుద్దీన్ మాత్రమేనని ఇప్పటికే అక్కడ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయం పక్కన పెడితే అసలు చాలామందికి గత 2014 ఎన్నికల్లో డిప్యూటీ సీఎం అయ్యే వరకు మహ్మద్ అలీ అంతగా పరిచయం లేని పేరు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన వెంటనే మహ్మద్ అలీని డిప్యూటీ సీఎం చేశారు కేసీఆర్. అయితే ముస్లిం కోటా కేసీఆర్ అలా చేశాడని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ రిజర్వేషను అయినా సరే తన స్టైల్లో కొన్ని అర్హతలు చూస్తారు. లాయల్టీ చూస్తారు. అది రెండో టెర్ములో అలీకి ప్రాధాన్యత ఇచ్చాక ఎవరీ అలీ అని సామాన్యులకు ఆసక్తి పెరిగింది. ఎందుకంటే కొడుకు చేత కూడా ప్రమాణం చేయించని కేసీఆర్ మహమూద్ అలీ చేత ప్రమాణం చేయించడం ఏంటి? అన్నది చాలామందికి ఆసక్తిని రేకెత్తించిన ప్రశ్న. అయితే, దీనికి పెద్ద చరిత్రే ఉంది.
అయితే 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు తొలిగా చేరిన బ్యాచ్ లో మహమూద్ అలీ ఒకరు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏరోజూ కేసీఆర్ మాటను జవదాటలేదు. పైగా తొలినాటి నుండీ కేసీఆర్ వ్యూహాలను అమలు చేయడం, బాస్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తారు. కేసీఆర్‌తో పాటు ప్రతి పర్యటనలో ఆయన తప్పకుండా ఉండేవారు. పార్టీ వ్యవహారాలు చురుగ్గా చూసేశారు. దీంతో పార్టీ మైనారిటీ విభాగానికి అధ్యక్షుడిని చేశారు కేసీఆర్. దాంతో అలీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించారు. తెలంగాణలో ఎస్సీలు, ఎస్టీల్లాగే పెద్ద సంఖ్యలో ఉన్న వారు ముస్లింలు. కాబట్టి ఉద్యమం విజయవంతం కావాలంటే ఆ వర్గాన్ని వెంట పెట్టుకోవాల్సిందే. అందుకే లాయల్టీ, పనితనం, చాణక్యం ఉన్న నేత అయిన అలీని కేసీఆర్ ఆదరించారు. పైగా పార్టీలు మారడం, అపజయాల్లో కుంగిపోవడం వంటివి మహమూద్ అలీ కెరీర్‌లో లేవు. అది ఆయనకు పెద్ద ప్లస్. పైగా మహమూద్ అలీ కుమారుడి గురించి మీరెపుడూ విని ఉండరు. ఆయన కేటీఆర్ లాగే చాలా స్మార్ట్. అప్‌టుడేట్‌గా ఉంటారు ఎక్కడా వివాదాలకు కూడా పోరు. పాత బస్తీ ముస్లింలకి విరుద్దంగా చక్కగా తెలుగు మాట్లాడతారు. అందరితో కలిసిపోతారు, కుటుంబ వ్యాపారలతో పాటు రాజకీయాల్లో తండ్రికి తోడు ఉంటారు. కుటంబం పరంగా కూడా అలీది కేసీఆర్‌కు సరిపోయే శైలి. అందుకే ఆయనకు కేసీఆర్ అంత గౌరవం ఇస్తారు. ఇక మహమూద్ అలీకి కూడా కేసీఆర్ అంటే ఎంతో అభిమానం. అది ఎంతలా అంటే 18 సంవత్సరాలుగా తమ ఇంట్లో కేసీఆర్ కోసమే ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించారు ఆయన. పార్టీ కలర్ థీమ్ తో మ్యాచ్ అయ్యేలా ఉంటుంది ఆ గది. గోడ మీద కేసీఆర్ ఫొటో ఒకటి ఉంటుంది. కేసీఆర్ ఆయన ఇంటికి వచ్చినపుడు కూర్చోవడానికి చేయించిన ప్రత్యేక గది అది. . కుర్చీ, టేబుల్, సోఫా ఇతర ఫర్నిచర్‌ను ఉంచారు. గోడ మీద కేసీఆర్ చిత్రపటం ఉంటుంది. ఆయన వస్తేనే ఈ గదిని తెరుస్తారు. ఇతర సమయాల్లో తాళం వేసి ఉంచుతారు అలీ. కేసీఆర్ వచ్చినపుడే దానిని ఉపయోగిస్తారు. కేసీఆర్ చేతికి ఓ గుడ్డ ఉంటుంది గమనించారా దానిని కేసేఆర్ కి కట్టేది అలీయే. కేసీఆర్ ఎక్కడికైనా బయలుదేరితే ఆయన ఇమామ్ -ఎ- జమీన్‌ను కట్టాల్సిందే. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి కొడుకుకు మించి మహమూద్ అలీకి ప్రాధాన్యం ఇచ్చారు కేసీఆర్. పైగా కీలకమైన హోంశాఖను ఆయనకు కట్టబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.