నటీనటులు : నాగచైతన్య , సమంత , దివ్యంకా కౌశిక్ , పోసాని
సంగీతం : గోపిసుందర్
నేపథ్య సంగీతం : తమన్
నిర్మాతలు : సాహు గారపాటి , హరీష్ పెద్ది
పెళ్ళికి ముందు మూడు సినిమాల్లో కలిసి నటించారు అక్కినేని నాగచైతన్య – సమంతలు. వాటిలో ఒక్క సినిమా అనుకుంటా సరిగా ఆడలేదు మిగతావన్నీ బానే ఆడాయి. ఇక ప్రస్తుతం హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు నాగ చైతన్య, ఈ క్రమంలో పెళ్లయ్యాక ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ఈ మజిలీ. Majili Movie Review and Rating టీజర్ , ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెరిగేలా చేసిన మజిలీ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .
కథ :
పూర్ణ ( అక్కినేని నాగచైతన్య ) మంచి క్రికెట్ ప్లేయర్, అనుకోకుండా విశాఖ నావీలో పనిచేస్తున్న ఆఫీసర్ కూతురు అన్షు ( దివ్యంకా కౌశిక్ )తో ప్రేమలో పడతాడు. కానీ పెద్దల వల్ల టీనేజ్ లవ్ స్టోరీ అర్ధాంతరంగా ముగుస్తుంది దాంతో ప్రేయసిని మర్చిపోలేక డిప్రెషన్ కి గురౌతాడు పూర్ణ. అలా డిప్రెషన్ లో ఉండగానే శ్రావణి ( సమంత )తో పెళ్లి అవుతుంది. Majili Movie Review and Rating ప్రేయసిని మర్చిపోలేక పెళ్ళాంతో సరిగ్గా కాపురం చేయలేక పూర్ణ ఎలాంటి మానసిక క్షోభ అనుభవించాడు. అలా వారిద్దరి జీవిత మజిలీ ఏమిటి అనేదే ఈ సినిమా కధ.
విశ్లేషణ :
ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. నిన్నుకోరి సినిమాతో డైరెక్టర్ అయిన శివ నిర్వాణ ఈ సినిమాతో మరో మారు సత్తా చాటాడు. ప్రేమలో తియ్యదనం అది విఫలం అయితే ఉండే గుండె కోతను కళ్ళకు కట్టినట్టు చూపాడు. కాకపోతే సినిమా మీద ఆయన మొదటి సినిమా ఛాయలు అక్కడక్కడా కనిపించినా అవి పెద్ద్డగా గుర్తించలేనివి. సిన్మా ఫస్టాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ తో బాగుండు, సమంతా ఎంట్రీ తర్వాత నుండి సినిమా నెమ్మదించింది. కాకపోతే సినిమా మీద ఉన్న అంచనాలను అయితే ఎక్కడా వమ్ము చేయలేదు. సెకండాఫ్ అంతా ఎమోషన్స్ తో బండి నడిపించేసాడు.
నటీనటుల విషయానిక వస్తే :
కొత్త అమ్మాయి దివ్యంకా కౌశిక్ గ్లామర్ తో అలరించింది అలాగే నటనతో కూడా ఆకట్టుకుంది . సమంత ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచింది . సమంత నటన గురించి కొత్తగా చెప్పేదేముంది మధ్య తరగతి గృహిణిగా నిజంగానే అద్భుతంగా నటించింది. Majili Movie Review and Rating ఇక నాగచైతన్య నటన విషయానికి వస్తే నటుడిగా మజిలీ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. టీనేజ్ కుర్రాడిగా, తీవ్ర మానసిక క్షోభ అనుభవించే యువకుడిగా రెండు విభిన్న కోణాలను ప్రదర్శించి నటుడిగా మరో మెట్టు ఎదిగాడు చైతూ. ఇద్దరు హీరోయిన్ లతో మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది చైతూకి. ఇక మిగిలిన పాత్రల్లో పోసాని , రావు రమేష్ లు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి.
సాంకేతిక వర్గం పని తీరు విషయానికి వస్తే మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఆరు పాటలను అందించాడు , ఆరు పాటలు కూడా సినిమాకు చాలా హెల్పయ్యాయి , అయితే నేపథ్య సంగీతం మాత్రం తమన్ అందించాడు. తమన్ రీ రికార్డింగ్ మజిలీ కి హైలెట్ గా నిలిచింది. విష్ణు శర్మ విజువల్స్ తో ఆకట్టుకున్నాడు . షైన్ స్క్రీన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. నిన్ను కోరి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన శివ నిర్వాణ మరోసారి హృదయానికి హత్తుకునే అంశంతో మజిలీ ని రూపొందించి విజయం సాధించాడు.
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : ప్రేమా…గుండెకోతల కలయికే ఈ మజిలీ
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 3/5