ఈమద్య కాలంలో సినీ తారలు మరియు బుల్లి తెర తారలు వారు చేస్తున్న పాత్రలతో కంటే వివాదాలతో ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. తెలుగు స్టార్ హీరోయిన్స్ నుండి యాంకర్స్ వరకు అమెరికాలో వ్యభిచారంకు పాల్పడ్డట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్లో పలువురు హీరోయిన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాకు వెళ్లేందుకు ఏ ఒక్క సౌత్ హీరోయిన్ కూడా ఇష్టపడటం లేదు. అక్కడ ఉన్న పరిస్థితులు వారిని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే సౌత్ సినీ ఇండస్ట్రీలో మరో సంచలన సంఘటన జరిగింది. మలయాళం బుల్లి తెర నటి సూర్య శశికుమార్‌ను పోలీసులు దొంగ నోట్ల కేసులో అరెస్ట్ చేశారు.
గత కొంత కాలంగా సూర్య శశికుమార్ తన సొంత ఇంట్లో దొంగ నోట్లను ముద్రిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తనకున్న సర్కిల్‌తో దొంగ నోట్లను ఆమె మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం సినీ పరిశ్రమలోని తనకు సన్నిహితులను వాడేసుకుంటుంది. సీరియల్స్‌లో ఈమె చేసిన పాత్రలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ గుర్తింపుతో ఇలాంటి చెడ్డ పనికి పెట్టుబడిని దక్కించుకుంది. తనకున్న మంచి పేరును వినియోగించుకుని దొంగ నోట్లను మార్చుతూ చాలా కాలంగా ఈమె ఈ వ్యాపారం చేస్తున్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. తాజాగా సూర్య శశికుమార్ ఇంట్లో ఏకంగా 57 లక్షల దొంగ నోట్లను పోలీసులు గుర్తించారు. దొంగ నోట్లను ముద్రించేందుకు 5 లక్షలు ఖర్చు చేసి సామాగ్రిని కొనుగోలు చేయయడం జరిగింది. ఈ కేసులో సూర్య శశికుమార్‌తో పాటు ఆమె తల్లి మరియు సోదరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం ప్రస్తుతం జాతీయ స్థాయిలో సంచలనం రేపుతుంది.