Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మింగమెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అనే సామెత ఏపీ కాంగ్రెస్ కి అతికినట్టు సరిపోతుంది. విభజన దెబ్బకి ఏపీ లో ఆ పార్టీ మూలాలే కదిలిపోయాయి. ఇక కాంగ్రెస్ అంటే ప్రేమని చంపుకోలేనివాళ్ళు, మరో పార్టీలోకి వెళ్లే అవకాశం లేని ఏ కొద్ది మందో అక్కడ మిగిలారు. ఎప్పుడైనా పార్టీకి మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూసిన వాళ్ళు కూడా మోడీ దూకుడు, రాహుల్ పనితనం చూసి కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఈ కోవలోనే కాంగ్రెస్ అంటే అభిమానం వున్నా భవిష్యత్ కోసం వైసీపీ లో చేరడానికి విజయవాడ నేత మల్లాది విష్ణు ఏర్పాట్లు చేసుకున్నారు.
కొత్త పార్టీలోకి వెళ్ళేటప్పుడు పాత పార్టీని తిట్టి వెళ్లడం ఓ ఆనవాయితీగా మారిన పరిస్థితుల్లో మల్లాది విష్ణు ఆ ఎపిసోడ్ సృష్టించలేదు. మర్యాదగా ఆ పార్టీకి రాజీనామా లేఖ పంపారు. తొలుత అందుకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరా అంగీకరించారని వార్తలు వచ్చినా ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఆ లేఖ పీసీసీ కి అందలేదట. ఆ తంతు పూర్తి కాకుండానే వైసీపీ అధినేత జగన్ ని కలవడానికి హైదరాబాద్ వెళ్తున్నందున విష్ణు మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించిందట. ఆయన మీద సస్పెన్షన్ వేటు వేస్తుందట. నాయకుల కోసం వెతుక్కుంటున్న కాంగ్రెస్ మర్యాదగా వెళ్తున్న వారి మీద యాక్షన్ అంటూ అతి చేయడం చూస్తుంటే కామెడీగా అనిపించడం లేదా?.
మరిన్ని వార్తలు