లేటైనా.. మమత చెప్పిందే నిజం

Mamatha Benarjee Thaughts About GST

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Mamatha Benarjee Thaughts About GST

ఒకే దేశం ఒకే పన్ను పేరుతో ఆర్భాటంగా జీఎస్టీని అమల్లోకి తెచ్చింది కేంద్రం. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో జీఎస్టీ కౌన్సిల్ ఏఱ్పాటు, చర్చోపచర్చల తర్వాత ఏ వస్తువులు ఏ పన్ను శ్లాబులో పెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంకా కొన్ని రాష్ట్రాలకు పన్ను మినహాయింపులు, కొన్ని వస్తువులకు మినహాయింపులపై చర్చలు జరుగుతున్నాయి.

జీఎస్టీ అమలు సాధ్యం కాదని, దేశంలో విభిన్న పరిస్థితులున్నాయని బెంగాల్ సీఎం మమత ఎప్పుడో చెప్పారు. కానీ కేంద్రం మాత్రం ఆమె మాటను అస్సలు పట్టించుకోలేదు. పైగా ఒప్పుకోకపోతే బలవంతంగా అయినా రుద్దేస్తామని ప్రకటించింది. కానీ జీఎస్టీ అమలయ్యాక కానీ కేంద్రానికి అసలు విషయం తెలిసిరాలేదు.

జీఎస్టీపై నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే అమలయ్యాక కూడా పలు వస్తువులపై పన్ను తగ్గింపులు, కొన్నింటిని పూర్తిగా మినహాయింపులు వంటి మాటలు చెబుతోంది కేంద్రం. అసలు ఇలా అమలుచేస్తే కేంద్రం అంచనా వేసిన ఆదాయం వస్తుందా అనేది అనుమానమే. మరి ఆదాయం రాకుండా రాష్ట్రాలకు ఏం పంచుతుందో కేంద్రం.