అతనో వివాహితుడు జీవనోపాధి కోసం మొబైల్ షాపు నడుపుతున్నాడు. ఇంతలో వేరే మహిళతో జరిగిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే తన ప్రియురాలు మరోవ్యక్తితో చనువుగా ఉంటోందని అనుమానించిన అతను ఉన్మాదంతో ఆమెను గొంతు కోసి చంపాడు. కసి తీరక తలను మొండెం నుంచి కత్తిరించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక కోలారు–చిక్కబళ్లాపుర సరిహద్దులోని కంచర్లపల్లిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం శ్రీనివాసపురం పట్టణం గఫార్‌ఖాన్ వీధికి చెందిన అజీజ్ (27) ఒక మొబైల్ షాపు నడుపుతున్నాడు.
అజీజ్ కు బెంగళూరుకు చెందిన అయూబ్‌ఖాన్ కూతురు రోషన్ ఖాన్ (24)తో పరిచయం ఏర్పడిఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే రోషన్ ఖాన్ ఇతర పురుషులతో కూడా చనువుగా ఉంటోందని అజీజ్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను అంతమొందించాలని భావించి చింతామణి తాలుకాలోని మురగమల్లా దర్గాలో పూజలు చేద్దామని నమ్మబలికి తీసుకువచ్చాడు. దర్గాను దర్శనం అయ్యాక ఊరి చివరనున్న మామిడి తోపు షెడ్లోకి వెళ్లారు. అక్కడ జరిగిన వాగ్వాదంలో అజీజ్ వేటకొడవలితో ఆమె గొంతు నరికి తల వేరుచేశాడు. తలను బ్యాగులో పెట్టుకొని బైక్‌పై శ్రీనివాసపురం స్టేషన్లో లొంగిపోయాడు.