రోజులు మారుతున్నాయి, ఆడవాళ్ళూ అభివృద్ధి చెందుతున్నారంటే ఏమిటో అనుకున్నా. కానీ ఒకప్పుడు అబ్బాయిలు చేసిన పని ఇప్పుడు అమ్మాయిలు చేస్తూ అదే అభివృద్ధి అని ఫీల్ అయిపోతున్నట్టున్నారు కొంతమంది ఆడవాళ్ళు. అదేదో జంబలకిడి పంబ సినిమాలో మగవాళ్ళు అందరూ ఆడవాళ్ళ కాళ్ళ దగ్గర పడే రోజు వస్తుందో లేదో కానీ ప్రేమించి మోసం చేసి ఇంకొకడ్ని కట్టుకునేందుకు సిద్దమయిపోయిన ఆడవాళ్ళ మనసు మార్చేందుకు వాళ్ళ ఇంటి ముందు చేరి పోరాటాలు చేయాల్సిన రోజులు వచ్చాయి. తాజాగా ఈరోజు హైదరాబాద్ లోనో బోరబండలో అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం తనను ప్రేమించి ప్రేమ పెళ్లికి నిరాకరిస్తున్నదనే కారణంగా ఓ ప్రియుడు ప్రియురాలి ఇంటి ముందు ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని బోరబండ సంజయ్‌నగర్‌కు చెందిన భాస్కర్ బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో కళాశాలలో జూనియర్ అయిన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. వివాహం చేసుకునేందుకు అమ్మాయి తరఫు పెద్దలు అంగీకరించకపోవడమే కాకుండా బెదిరించారని బాధితుడు పేర్కొంటున్నాడు. దీంతో గురువారం మహబూబ్‌నగర్‌లోని ప్రియురాలి ఇంటికి వచ్చి ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. చికిత్స సమయంలో పోలీసు అధికారులు అతడిని విచారించగా తన ప్రియురాలి బంధువైన మహబూబ్‌నగర్‌కు చెందిన నాయకుడు, ఆమె కుటుంబసభ్యులు బెదిరించారని అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు మాత్రం గురువారం రాత్రి వరకు కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.