నడిరోడ్డులో నరికి నరికి చంపారు…వివాహేతర సంబంధం కేసే…!

Man Killed In Attapur

హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఎర్రగడ్డలో ఓ వ్యక్తి తన కుమార్తెపై కత్తితో దాడి చేసిన సంఘటన మరవక ముందే ప్రజలను వణికించే మరో ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కళ్లెదుటే నలుగురు దుండగులు ఓ వ్యక్తిని వెంటాడి వేటాడి గొడ్డలితో కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం జుమ్మే రాత్ బజార్ కు చెందిన రమేశ్‌ (35) అనే వ్యక్తి ఓ హత్య కేసులో ఉప్పరపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా దుండగులు అతడిని చంపబొయారు. దీంతో, రమేష్ ఆటో దిగి పరిగెత్తాడు. అత్తాపూర్ మెట్రో పిల్లర్ 143 వద్ద ఉన్న బస్టాప్ వద్దకు పరిగెడుతుండగా దుండగులు అతడిపై గొడ్డలితో దాడిచేశారు.

murder-attapur

స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఓ దుండగుడు రమేష్‌ను నరుకుతూనే ఉన్నాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ అతన్ని అడ్డుకున్న పక్కకు తోసేసి మరీ రమేష్‌ను నరికారు. ఈ సమాచారం తెలిసి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులను చూసి కూడా దుండగులు భయపడలేదు. వారి కళ్లెదుటే రమేష్‌పై మరోసారి దాడి చేశారు. నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఒకే మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న రమేశ్‌, మహేశ్ లు స్నేహితులే. అప్పుడు మహేశ్‌ ని శంషాబాద్‌లో హత్య చేశాడు.‌ ఆ కేసులో అరెస్టయి అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ కేసు విచారణలో భాగంగానే రమేశ్‌ ఈరోజు ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో హాజరయ్యాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మహేశ్‌ తండ్రి, బంధువు అదనుచూసి రమేశ్‌ను హత్య చేశారు.

attapur-murder