ఓటిటి పార్ట్నర్ ని ఫిక్స్ చేసుకున్న “మనమే”

"Maname" who fixed the OTT partner.
"Maname" who fixed the OTT partner.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అలాగే ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ “మనమే” కోసం తెలిసిందే. మరి డీసెంట్ బజ్ నడుమ వచ్చిన ఈ మూవీ థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. అయితే ఈ మూవీ రిలీజ్ తర్వాత కూడా ఓటిటి పార్ట్నర్ ఎవరు ఏంటి అనేది ఇంకా బయటకి రాలేదు.

"Maname" who fixed the OTT partner.
“Maname” who fixed the OTT partner.

మధ్యలో డిస్నీ+ హాట్ స్టార్ లో వస్తుందని బజ్ వచ్చింది. కానీ ఇప్పుడు అయితే లేటెస్ట్ క్లారిటీ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ మూవీ హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారట. సో కొన్ని రోజుల్లోనే ఈ మూవీ అందులో స్ట్రీమింగ్ కు రానుంది అని చెప్పాలి. అలాగే దీనిపై అధికారిక క్లారిటీ కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ కి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించగా హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించాడు.