కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తనలాగే తనయులు కూడా మంచి హీరోలు అవ్వాలని ఇద్దరు పుత్రులను కూడా సినిమా రంగంలోకి దించేశాడు. కొన్నాళ్లు ఇద్దరి పరిస్థితి పర్వాలేదు అనిపించినా ప్రస్తుతం చెప్పుకోదగ్గ చిత్రాలేవి వీరి ఖాతాలో లేవు. దాంతో మంచు వారి అబ్బాయిలు అడపాదడపా సినిమాలు చేస్తూనే ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోంటున్నారు. గతంలో మంచు మనోజ్ ఇక సినిమాల్లో నటించబోనని సామాజిక మాద్యమంలో తెలియజేశాడు. కానీ మోహన్‌బాబు, విష్ణు సూచన మేరకు సినిమాల్లో తప్పక నటిస్తాను, తనకు సినిమాలపై ఉన్న ప్రేమ తగ్గదు అంటూ మాట మార్చాడు.
ప్రస్తుతం ఇద్దరు మంచు అబ్బాయిలు సినిమాపై కంటే సామాజిక కార్యక్రమల్లో అధికంగా పాల్గోంటున్నారు. వీరు ఎక్కువగా విద్యా రంగంలో, బాలికల అభివృద్ది మొదలైన అంశాలపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ఇటీవలె మంచు మనోజ్ తిరుపతికి తాత్కాలిక మకాం మార్చాడు. తాత్కాలిక మకాం ఎందుకు అంటూ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎలాగు సినీ కెరియర్ ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి రాజకీయ అరంగేట్రం చేయడానికి అని తెలుస్తోంది. గతకొంత కాలంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గోంటూ ప్రజల్లోకి వెళ్లిన మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మంచువారి అబ్బాయి కొత్త ఆలోచన ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.