2019 ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ నిరుద్యోగులు, ఆశావహుల జంపింగ్ లు మొదలయ్యాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాల రసవత్తరంగా మారబోతున్నాయి. మొన్నటి వరకు వైసీపీ, టీడీపీ మధ్యనే పోటీ ఉంటుందని అంత అనుకున్నారు. కానీ ఇప్పుడు బరిలో జనసేన కూడా దిగబోతుంది. ఇప్పటికే నాయకులు జనసేన లోకి వస్తుండడం తో అందరిలో ఉత్కంఠ మొదలు అయ్యింది. ఈ నేపథ్యం లో మరో సీనియర్ నేత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి ఇవాళ వైసీపీ పార్టీ లో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మానుగుంటకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెం వద్ద దాదాపు 300 మంది కార్యకర్తలతో మహీధర్‌రెడ్డి పార్టీ లోకి చేరడం వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి గతంలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు మహీధర్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మహిధర్ రెడ్డి రాకతో ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.