పీకే సలహాతో జగన్ అలెర్ట్ !

Reason Behind jagan not targeted chandrababu

వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి నిశితంగా పరిశీలించిన వారికి ఇటీవలి కాలంలో ఆయన శైలిలో వచ్చిన మార్పులు మనం గమనించవచ్చు. ప్రజా సంకల్పయాత్ర మొదలు పెట్టినప్పటి నుండి చంద్రబాబుపై జగన్ ఎన్ని విమర్శలు చేశారో, ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారో అందరికీ తెలుసు. పాదయాత్ర మొదలయిన నాటి నుండి చంద్రబాబును ఘాటైన పదజాలంతో విమర్శిస్తూనే ఉన్నారు. 2500 కి.మీ మేర పాదయాత్ర సాగినా కేంద్రం ఎపీకి అన్యాయం చేసిందన్న మాట ఆఫ్ థ రికార్డ్ గా కూడా అన్ని జగన్ అనుక్షణం చంద్రబాబునే జగన్ టార్గెట్ చేశారు. అయితే అంత బాగా జరిగిన ఈ టార్గెట్ పర్వం ముగింపుకి వచ్చిన్నట్టే అనిపిస్తోంది. నిత్యం చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడిన జగన్ ఇప్పుడు హటాత్తుగా తన స్వరం మార్చుకున్నారు. చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయడం లేదు. ఎందుకంటే చంద్రబాబును నిత్యం విమర్శించడం వల్ల బాబుకు ప్రజల్లో సానుభూతి పెరుగుతుందన్న అంచనాలో జగన్ ఉన్నారు ఇదే విషయాన్ని పీకీ టీం కూడా స్పష్టం చేయడంతో తాను చంద్రబాబును టార్గెట్ చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని జగన్ కి అర్ధం అయ్యిందట.

రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తామని, ప్రత్యేకా హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన ఎన్డీఏకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షల పేరట రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు పై వ్యక్తిగత విమర్శలకు దిగితే ప్రజలు పెద్దగా స్వీకరించరనే భావనలో జగన్ ఉన్నారు. ఇప్పటికే హోదా ఇవ్వని మోడి సర్కార్ ను వదిలి కేవలం చంద్రబాబును జగన్ టార్గెట్ చేస్తున్నారనే విషయాన్ని టీడీపీ బలంగా వినిపిస్తోంది. అందుకే జగన్ ఇప్పుడు రూటు మార్చారు. బాబుపై వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లకుండా కేవలం పాలనాపరమైన లోపాలకు సంబంధించి ఆరోపణల మీదే దృష్టి పెట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, రాజధాని నిర్మాణాల్లో అక్రమాలపైనే జగన్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇసుక మాఫియాకు బాబు సర్కార్ చిరునామాగా మారిందని, నిరుద్యోగ భృతి ఎక్కడికిపోయిందని విమర్శిస్తున్నారు. దీంతో జగన్ వ్యవహర శైలి మారిందనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.