తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామంలో ఓ కాంట్రాక్టర్ పై మావోయిస్ట్ లు విరుచుకు పడ్డారు. తెలంగాణ- ఛత్తీష్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్ట్ లు.. కాంట్రాక్టర్ ను అతికిరాతకంగా కొట్టి చంపారు.
అసలేం జరిగిందంటే.. వెంకటాపురం శివాలయం కాలనీకి చెందిన కాంట్రాక్టర్ షేర్ శేఖర్..ఛత్తీష్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా చార్గరోడి- బండర్ పల్లి గ్రామాల మధ్య పీఎం గ్రామీణ సడక్ యోజన పథకం కింద రోడ్డు పనులు చేపట్టాడు. ముందుగానే ఈ రోడ్డును నిర్మించవద్దని కాంట్రాక్టర్ కి మావోలు చెప్పి చూశారు. అయినాగానీ.. అతను రోడ్డు పనులు ప్రారంభించాడు. తాజాగా మావోయిస్ట్ లు నిర్మాణ పనులు జరిగే చోటకు వెళ్లి.. రెండు ట్రాక్టర్లను, ఒక జేసీబీని తగలబెట్టారు. అంతేకాకుండా అక్కడే ఉన్న శేఖర్ ను తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుపై మృతి చెంది పడి ఉన్న శేఖర్ ను స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వెంకటాపురంలో పెద్ద ఎత్తున కలకలం రేగింది.