Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య ప్రిసిల్లా చాన్ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు జుకర్ బర్గ్ దంపతులు ఆగస్ట్ అని పేరుపెట్టుకున్నారు. ఆగస్ట్ కు ముందు వారికి మాక్సిమా చాన్ అనే పాప ఉంది. తనకు రెండోపాప పుట్టిన విషయాన్ని, ఫ్యామిలీ ఫొటోను జుకర్ బర్గ్ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
ప్రిసిల్లా చాన్ చేతిలో ఉన్న ఆగస్ట్ ను జుకర్‌బర్గ్ ఒళ్లో కూర్చున్న మాక్స్ ప్రేమగా పట్టుకున్న ఈ ఫొటో ఇప్పుడు ఫేస్ బుక్ లో విపరీతంగా షేర్ అవుతోంది. మాక్స్ పుట్టినప్పడు రాసినట్టుగానే ఇప్పుడు కూడా జుకర్‌బర్గ్ తన రెండో కూతురుకు ప్రేమతో ఓ లేఖ రాశారు. డియర్ ఆగస్ట్…అని సంబోధించిన జుకర్ బర్గ్ ఈ లేఖ ద్వారా తన చిన్నారికి ఈ ప్రపంచంలోకి స్వాగతం పలికారు. ఆగస్ట్ మంచి విద్య, బలమైన బంధాలు, సమానత్వం ఉన్న ప్రపంచంలో పెరగాలని తండ్రి ఆకాంక్షించారు.
బాల్యం చాలా అద్భుతమైనదని, దాన్ని ఆగస్ట్ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అనుభవించాలని కోరుకున్నారు. శాస్త్ర సాంకేతిక కాలంలో తమ పిల్లలు తమ కన్నా మంచిజీవితాన్ని అనుభవిస్తారని విశ్వాసం వ్యక్తంచేసిన జుకర్ బర్గ్…దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులమైన తమపై ఉందని లేఖలో రాశారు. ప్రిసిల్లా డెలివరీకి ముందే జుకర్ బర్గ్ తన చి్న్నారికి సమయం కేటాయించేందుకు వీలుగా పితృత్వ సెలవు తీసుకున్నారు. 2015లో పెద్ద పాప మాక్సిమా చాన్ పుట్టినప్పుడు కూడా ఆయన ఈ సెలవు ఉపయోగించుకున్నారు.
మరిన్ని వార్తలు:
ఇంకా కోలుకోని కాంగ్రెస్
వైసీపీకి ముందే గొయ్యి తవ్విన కన్నబాబు.
కాకినాడలో కింగ్ ఎవరు..?