సినిమా హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చినా మెగా కోడలిగానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది రేణు దేశాయ్. బద్రి, జానీ లాంటి సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ తో కొన్నేళ్ల పాటు సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లైంది. 2008లో పెళ్లి చేసుకుంది. ఏమైందో తెలియదు కానీ సడన్ గా ఇద్దరూ విడిపోయారు. పవన్, రేణు విడిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రేణుదేశాయ్ తో విడిపోయిన తర్వాత అన్నా లెజినీవాను మరో పెళ్లి చేసుకున్నాడు పవన్. కానీ రేణు మాత్రం పిల్లలతో ఒంటరిగా పూణేలో ఉంటుంది. ఆ మధ్య ఈమె ఆరోగ్యం కూడా దెబ్బతింది. తను ఒంటరి అనే భావన కలుగుతుందని.. పిల్లల కోసమైనా తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది రేణు. తనను అర్థం చేసుకునే వాడు వస్తే కచ్చితంగా అతడి చేయి పట్టుకోడానికి సిద్ధమే అని చెప్పింది రేణుదేశాయ్. ఏడాది కిందే ఆమెకు ఆ తోడు.. చేయి దొరికింది. తాజాగా ఇన్ స్టాలో తన హబ్బీ తీసిన ఫోటోలు పోస్ట్ చేసింది రేణు. ఆ మధ్య ఓ వ్యక్తి చేయి పట్టుకుని.. నాకు ప్రేమ దొరికింది.. ఇన్నాళ్ల నా ప్రేమకు తీరం నువ్వు.. నాలోనే నిన్ను చూసాను.. ఇంకెప్పుడూ నా చేయి విడవకు అంటూ ప్రేమలేఖ కూడా రాసింది రేణుదేశాయ్. అయితే చాలా రోజులుగా ఈమె పెళ్లి గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఆ ప్రయత్నం మానుకుందేమో అనే వార్తలు వినిపించాయి. అయితే అలాంటిదేం లేదని తన హబ్బీ తీసిన ఫోటోలు ఇవే అంటూ ఆయనకు అందరి సాక్షిగా థ్యాంక్స్ కూడా చెప్పి ఇప్పుడు మళ్లీ ఫోటోలతోనే సమాధానం ఇచ్చింది రేణు దేశాయ్.