Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాస్ మహారాజ రవితేజ కెరీర్ ఆరంభం నుండి కూడా పారితోషికం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కొన్ని సినిమాలకు పారితోషికం పట్టింపు లేకుండా సినిమాలు చేశాడు. అందరు హీరోల మాదిరిగా సినిమా సక్సెస్ అవ్వగానే పారితోషికాన్ని అమాంతం పెంచడం వంటి పనులు రవితేజ చేసేవాడు కాదు. కాని ప్రస్తుతం రవితేజ ప్రస్తుతం చేస్తున్న పని అందరికి షాక్‌గా ఉంది. రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం విడుదలైంది. ‘రాజా ది గ్రేట్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రవితేజ తన పారితోషికాన్ని దాదాపు 30 శాతం పెంచాడు.
రవితేజ భారీ ఎత్తున పారితోషికాన్ని పెంచడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. ఆయనతో సినిమాలు నిర్మించాలనుకున్న నిర్మాతలు బ్యాక్ అవుతున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు క్యాన్సిల్ అయినట్లుగా సమాచారం అందుతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాను రవితేజతో రీమేక్ చేసేందుకు ఒక చిన్న నిర్మాత రైట్స్ దక్కించుకున్నాడు. సినిమా నచ్చి, రీమేక్ చేద్దామన్న రవితేజ తన పారితోషికం భారీగా చెప్పడంతో నిర్మాత ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. ఇలా పలువురు నిర్మాతలు రవితేజ పారితోషికంతో ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.
గతంలో రవితేజతో సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా బాగుంటేనే సినిమా చూస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్స్‌ను రాబట్టే అంత దమ్ము రవితేజలో లేదు. అందుకే ఆయనతో భారీ పారితోషికం ఇచ్చి సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు కాస్త ఆలోచిస్తున్నారు. రవితేజ మాత్రం తన పారితోషికం నిర్ణయంలో మార్పు లేదు అంటూ గట్టిగా చెబుతున్నాడు