ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మే 2వ తేదీన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్ల నిమిత్తం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం విజయవాడలోని జల వనరుల శాఖ రైతు శిక్షణా కేంద్రంలో సమావేశమైంది. ప్రధాని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.





