Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘ఢీ’, ‘వెంకీ’, ‘రెడీ’, వంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరినీ ఆకట్టుకున్న మాష్టర్ భరత్ అందరికీ గుర్తుండే ఉంటాడు… మంచి నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్టర్ భరత్. ఇప్పుడు ఆ బుల్లి నటుడు చాలా పెద్దగా అయ్యాడు. దీంతో బాల నటుడిగా మెప్పించిన అతను ఇప్పుడు నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ‘ఏబీసీడీ’ చిత్రంలో శిరీష్ స్నేహితుడి పాత్రలో భరత్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా శిరీష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘‘ఏబీసీడీ’ సినిమాలో మాస్టర్ భరత్ నా స్నేహితుడిగా ఫుల్ లెన్త్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారబోతున్నాడు. వెల్కం భరత్. ఇప్పుడు భరత్‌ని చూస్తే ఎవ్వరూ గుర్తుపట్టరు. కానీ వెన్నెల కిశోర్ గుర్తుపట్టాడు. కాకా కో ప్రణామ్’ అని ట్వీట్ చేశారు. గతేడాది ‘ఈడు గోల్డ్ ఎహె’లో ఒక పాత్రలో మెరిసిన భరత్, ఇప్పుడు అల్లు శిరీశ్ సినిమా ద్వారా తన ఆర్టిస్ట్ జర్నీని కొనసాగించనున్నాడు. ఇక ఈ చిత్రంలో శిరీశ్ సరసన రుక్సార్ నటించబోతోంది. మధుర శ్రీధర్, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు.