దేశంలో లాక్ డౌన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లాక్ డౌన్ ఎత్తేస్తారా? మరికొంత కాలం పొడిగిస్తారా? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లోనే ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటి ఎన్నో సందేహాలతో దేశ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించింది. ఈనెల 14వ తేదీతో లాక్ డౌన్ ముగియనుండటంతో అందరిలీ ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈరోజు ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో కీలకంగా చర్చించారు. ఆ చర్చ కాసేపటి క్రితం ముగిసింది. లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ.. అంతా లాక్ డౌన్ పొడిగించాలనే మంత్రాన్నే పటించారు. అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఏకావాక్య తీర్మానం వలె లాక్ డౌన్ పొడిగించాల్సిందే.. లేకపోతే పరిస్థతి అదుపుతప్పుతుందనే సంకేతాలే వచ్చాయి.
అయితే ఇప్పుడు మోడీ.. ఏం చేస్తారు అనేదానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కొందరు రెడ్ జోన్లకే పరిమితం చేయాలనీ… మరి కొందరు కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో మోడీ తాను 24 గంటలూ అందుబాటులో ఉంటానని ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా తెలపమని సీఎంలకు స్పష్టం చేశారు. అలాగే… ఏలాంటి సూచనలనైనా నిరభ్యంతరంగా చెప్పవచ్చని మోడీ ఆయా రాష్ట్రాల సీఎంలను కోరారు.
అంతేకాకుండా పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగాలకు అత్యవసరంగా రాయితీలు ప్రకటించమని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మోడీని కోరారు. ‘కరోనా’ పరీక్షలు వేగంగా నిర్వహించడానికి ‘రాపిడ్ టెస్టింగ్ కిట్లు’ సరఫరా చేయమని ప్రధానికి విజ్ఞప్తి చేసారు. ఇంకా ఎవరికివారు రాష్ట్రాలు ‘లాక్ డౌన్’పై నిర్ణయం కీసుకోకుండా.. దేశ వ్యాప్తంగా ఒకే తరహా అమలయ్యేలా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కోరారు. మొత్తానికి లాక్ డౌన్ పొడిగించాలనే తారకమంత్రాన్నే అన్ని రాష్ట్రాల సీఎంలు జపించారు. అయితే కరోనా ప్రబలంగా ఉన్న ‘రెడ్ జోన్ల’ లో మరింత కఠినంగా ‘లాక్ డౌన్’ అమలుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది.