పవర్​స్టార్ కి మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెల్​కమ్.. వీడియో మాత్రం కచ్చితంగా చూడాల్సిందే …!

Mega Family Grand Welcome to Powerstar..
Mega Family Grand Welcome to Powerstar..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గారు ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకి మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా వెల్​కమ్ చేసారు . పవర్ స్టార్ తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు హైదరాబాద్​లో ఆయన నివాసానికి వెళ్లారు. ఢిల్లీ లో ఎన్డీయే కూటమి సమావేశాన్ని ముగించుకుని హైదరాబాద్​ వచ్చిన పవన్, భార్య అన్నాలెజినోవా, కుమారుడు అకీరాలతో కలిసి నేరుగా చిరు నివాసానికి వెళ్లగా ఆయనకి ఘనస్వాగతం లభించింది.

Mega Family Grand Welcome to Powerstar
Mega Family Grand Welcome to Powerstar

తల్లి అంజనా దేవి వారికి గుమ్మడి కాయతో దిష్టి తీయగా, పవన్​ అక్కాచెల్లెల్లు, వదినలు నీరాజనాలు ఇస్తూ లోపలికి గ్రాండ్ గా ఆహ్వానించారు. ఈ విజయోత్సవంలో భాగం అయ్యేందుకు మెగా కుటుంబ సభ్యులందరూ చిరు ఇంటికి వెళ్లారు . అన్నయ్య చిరంజీవి రాగానే నేరుగా ఆయన కాళ్లకి నమస్కారం చేయగా, పవన్​ని పైకి లేపి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు చిరు. ఆ తర్వాత తన తల్లి అంజనాదేవి, వదిన సురేఖల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అనంతరం ‘కల్యాణ్‌ బాబు హ్యాట్సాఫ్‌’ అని రాసి ఉన్న కేక్‌ని కట్‌ చేసి పవన్‌ తన కుటుంబసభ్యులకి తినిపించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది . వీడియోలో దృశ్యాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే గూస్​బంప్స్ గ్యారెంటీ. మీరూ కూడా ఒక సారి ఈ వీడియో చూసేయండి.