మెగా ఫ్యామిలీ అంతా పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాలి !

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏమీ అన‌న‌ని త‌న త‌ల్లిపై వేసిన ఒట్టును ఆమె ప‌ర్మిష‌న్ తోనే తీసేసి గట్టున పెట్టిన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌…జ‌న‌సేనానిపై త‌న సెటైర్లు కొన‌సాగిస్తున్నారు. తాజాగా…హైద‌రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన అభిమానుల‌ను ప‌వ‌న్ ఆదుకోవాల‌ని వ‌ర్మ కోరారు. హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ వ‌ద్ద ఏబీన్ ఆంధ్ర‌జ్యోతి వాహ‌నాల‌ను ధ్వంసం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డంపై ప్ర‌ముఖ ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేశ్ స్పందించారు. ప‌వ‌న్ ను ఉద్దేశిస్తూ క‌త్తి ఓ ట్వీట్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్…మీ ఫ్యాన్స్ కు హెల్ప్ చేయి…ఈ సారి పారిపోవ‌ద్దు. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి వాహ‌నాల‌ను ధ్వంసం చేయ‌డంలో సంబంధంఉన్న ఐదుగురు వ్య‌క్తుల‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
జ‌న‌సేన నాయ‌కుడు, న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అభిమానుల‌మ‌ని వారు చెబుతున్నారు. నిందితుల‌ను జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలోకి తీసుకున్నారు అని క‌త్తి త‌న ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై స్పందిస్తూ వ‌ర్మ‌…ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప‌రోక్షంగా సెటైర్ వేశారు. క‌త్తి మ‌హేశ్ ను ఉద్దేశించి..ఎస్ ..మీరు చెప్పింది క‌రెక్ట్ అని వ్యాఖ్యానించిన వ‌ర్మ త‌రువాత‌…ఫిలింఛాంబ‌ర్ కు ఏ విధంగా అయితే ఆయ‌న వెళ్లారో, అదే విధంగా మొత్తం మెగా కుటుంబంతో క‌లిసి ఆయ‌న పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి వారికి మ‌ద్ద‌తుగా నిల‌వాలి అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరును ప్ర‌స్తావించ‌కుండా..ట్వీట్ చేశారు.