Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“సైరా నరసింహారెడ్డి ” సినిమా షూటింగ్ ఏర్పాట్లలో బిజీబిజీగా వున్న మెగా స్టార్ చిరంజీవి రాజకీయాలకి సంబంధించి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట. కొన్నాళ్లుగా కాంగ్రెస్ కి కూడా దూరంగా ఉంటున్న చిరు రాజ్యసభ సభ్యత్వ గడువు కూడా త్వరలో ముగిసిపోనుంది. ఆ తర్వాత రాజకీయంగా ఏ వైఖరి తీసుకోవాలనే అంశం మీద చిరు ఇప్పటికే ఓ డెసిషన్ తీసుకున్నారట. నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత ఏపీ రాజకీయాల్లో వస్తున్న మార్పుల్ని చిరు పసిగట్టారట. అదే సమయంలో ఇటు అధికార టీడీపీ, అటు విపక్ష వైసీపీ నుంచి చిరుకి తాజాగా కూడా ఆహ్వానాలు అందాయట. టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు చిరంజీవిని తమ పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పారట. రాజ్యసభ స్థానంతో పాటు 2019 nda సర్కార్ లో మంత్రిగా అవకాశం వచ్చే అవకాశం ఉందని కూడా వివరించారట.
ఇక కష్టాల్లో వున్న వైసీపీ అయితే మెగా స్టార్ కి ఓపెన్ ఆఫర్ ఇచ్చిందట. పార్టీ లో ఆయన కోరుకున్న స్థానం ఇవ్వడానికి రెడీ అని చెప్పిందట. పైగా తాను అనుకున్న వారికి ఓ ఐదు అసెంబ్లీ సీట్లు కూడా ఇస్తామని కూడా చెప్పిందట. అన్ని విషయాలు విన్నాక త్వరలో తన నిర్ణయం వెల్లడిస్తానని చిరు రెండు పార్టీలకి జవాబు ఇచ్చారట. అయితే ఆ నిర్ణయం సంచలనం అని తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చాక తానేమి పోగొట్టుకున్నానో అర్ధం చేసుకున్న చిరు ఇక పాలిటిక్స్ కి గుడ్ బై కొట్టడానికి డిసైడ్ అయిపోయారట. అందుకు సంబంధించి త్వరలో నిర్ణయం ప్రకటించడం మాత్రమే మిగిలివుందట.