అదిరింది లైన్‌ క్లీయర్‌.. తెలుగులోనూ వివాదం ఖాయం

Mersal Telugu dubbed version adhirindhi movie censor completed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విజయ్‌ హీరోగా తెరకెక్కిన వివాదాస్పద చిత్రం ‘మెర్సల్‌’ తమిళనాడులో ఏకంగా 200 కోట్లు వసూళ్లు చేసింది. విజయ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను అందుకున్న ఆ సినిమాను తెలుగులో ‘అదిరింది’ అంటూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. గత వారంలోనే ‘అదిరింది’ని విడుదల చేయాలనుకున్నారు. విడుదల తేదీని కూడా ప్రకటించారు. అయితే సెన్సార్‌ బోర్డు నుండి క్లీయరెన్స్‌ రాకపోవడంతో ‘అదిరింది’ చిత్రాన్ని వాయిదా వేయడం జరిగింది. తమిళంలో వివాదాస్పదం అయిన జీఎస్టీ డైలాగ్స్‌ను తెలుగులో తొలగిస్తేనే సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇస్తామని సెన్సార్‌ బోర్డు సభ్యులు వాదించారు. కాని తెలుగులో ఆ డైలాగ్స్‌ను తీసేది లేదని, సెన్సార్‌ బోర్డు సభ్యులకు నిర్మాతలు తేల్చి చెప్పారు.

జీఎన్టీపై వివాదాస్పద డైలాగ్స్‌ కారణంగా ‘అదిరింది’ సినిమాకు సెన్సార్‌ చేసేందుకు సెన్సార్‌ బోర్డు విముఖత వ్యక్తం చేసింది. ఎట్టకేలకు సెన్సార్‌ బోర్డు నుండి ‘అదిరింది’కి క్లీయరెన్స్‌ వచ్చింది. చట్టపరమైన చిక్కులు ఏమీ లేనందున సెన్సార్‌ బోర్డు ఆ డైలాగ్స్‌తోనే అదిరిందికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగింది. తెలుగులో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగ్స్‌ ఉండనున్న నేపథ్యంలో తెలుగులో కూడా సినిమా వివాదాస్పదం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

Image result for vijay adirindi movie

తెలుగులో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. సినిమాలో వివాదాస్పద డైలాగ్స్‌ ఉన్న కారణంగా బీజేపీ నాయకులు ఎలాగూ ఆందోళనలు నిర్వహిస్తారు. అలా చేయడం వల్ల సినిమాకు భారీగా పబ్లిసిటీ దక్కే అవకాశం ఉంది. రెండు మూడు రోజులు ఆందోళనల తర్వాత జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు తొలగిస్తారు. అప్పటికే సినిమా పబ్లిక్‌లోకి దూసుకు వెళ్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. తొలగిస్తామని ముందే భావించినా కూడా సెన్సార్‌ బోర్డు వద్ద ఆ డైలాగ్స్‌ కోసం పోరాడటం వెనుక పబ్లిసిటీ స్టంట్‌ ఉందని కొందరు అంటున్నారు.