పాపం పవన్ మాజీ మిత్రుడికి అదిరిందిగా…

Pawan kalyan friend Sharath Marar troubles with Vijay adirindi movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాజకీయ పదవులు, ఉద్యోగాలకి మాజీ అనే మాట సెట్ అవుతుందేమో గానీ బంధాలు, అనుబంధాలు, స్నేహాలు విషయంలో కాదు అనుకుంటాం. కానీ స్నేహంలోనూ తాజా, మాజీ ఎంటర్ అయిపోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహ బృందం మాట ఎప్పుడు వచ్చినా ముందుగా వినిపించే పేరు శరత్ మరార్. అప్పట్లో వారి మధ్య బంధం ఎలా ఉండేది అంటే… మెగా హీరోల ఫంక్షన్స్ కి పవన్ కొన్ని ఇబ్బందులతో వెళ్లలేకపోతే తన బదులుగా శరత్ మరార్ ని పంపించేంతగా. అటు మెగా ఫామిలీ కూడా ఆయన్ని పవన్ లా ఆదరించేంత. అయితే ఆ బంధం బీటలు వారిందని ఈమధ్య వచ్చిన వార్తలు నిజమే అనిపించే ఘటనలు జరుగుతున్నాయి.

జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ రోజు పవన్ సన్నిహితులు అంతా కనిపించారు. ఒక్క శరత్ మరార్ తప్ప. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు నిర్మించిన శరత్ మరార్ ఆ నష్టాలకి సంబంధించి పవన్ తో విభేదించినట్టు ఫిలిం నగర్ టాక్. పవన్ కోటరీ నుంచి దూరం అయ్యాక తమిళ్ లో దుమ్ము రేపుతున్న మెర్సెల్ డబ్బింగ్ రైట్స్ కొనుక్కుని కూడా సెన్సార్ ఇబ్బందులతో దాని తెలుగు వెర్షన్ “అదిరింది “ రిలీజ్ చేయలేకపోతున్నారు. ఈ విషయంలో పవన్ కూడా పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఇక పవన్ కి దగ్గరగా వున్నప్పుడు శరత్ ప్రవర్తనతో ఇబ్బంది పడిన వాళ్ళు ఇప్పుడు పరిస్థితిని అడ్డం పెట్టుకుని అతనితో చెడుగుడు ఆడుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పవన్ తో స్నేహం మాజీ అయ్యాక శరత్ కి కష్టాలు పెరిగాయి.