బంపర్ ఆఫ‌ర్లు…రూ.4 కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ, ఇంకా మరెన్నో !

Mi flash sale with bumper offers

మొబైల్ రంగంలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఎంతో మార్కెట్ సంపాదించుకున్న ఎంఐ కంపెనీ దిగ్గ‌జ కంపెనీల‌కు సైతం ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. బ‌డ్జెట్ కు త‌గ్గ‌ట్లుగా స్మార్ట్ ఫోన్లు, మొబైల్ యాక్స‌స‌రీస్,టెలివిజ‌న్ల‌కు మార్కెట్లో ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్న షియోమీ కంపెనీ, తాజాగా నాలుగేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ఎంఐ వార్షికోత్స‌వం పేరిట ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్లను వింటుంటేనే పాపం ప్రత్యర్ధి కంపెనీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖాయం…ఈ ఆఫ‌ర్లు జులై 10 నుంచి 12 వ‌ర‌కు ఈ ఆఫ‌ర్లు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఎంఐ వార్షికోత్స‌వం సందర్భంగా జులై 10 నుంచి 12వ తేదీ వరకూ ప్రతి రోజూ సాయంత్రం 4గంటలకు షామీ రూ.4 ఫ్లాష్‌సేల్‌ నిర్వహిస్తుంది. ఫ్లాష్ సేల్ ద్వారా కేవ‌లం 4 రూ.కే 55 ఇంచుల ఎల్ఈడీ స్మార్ట్ టీవీతో పాటు, రెడ్‌మి వై2, రెడ్‌మి నోట్‌5 ప్రో, ఎంఐ బ్యాండ్‌2లను ఫ్లాష్‌సేల్‌ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఎస్‌బీఐ, పేటీఎం, మొబిక్విక్‌ల ద్వారా చెల్లింపులు చేసేవారు అదనంగా ఇంకొంత రాయితీని పొందవచ్చ‌ని తెలిపింది.

ఎస్‌బీఐ కార్డు ద్వారా కనీసం రూ.7,500 లావీదేవీపై రూ.500 రాయితీ అందించనుండగా, రూ.8,999 కొనుగోలుపై పేటీఎం ద్వారా చెల్లింపు చేసిన వారికి రూ.500 క్యాష్‌బ్యాక్‌, విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1,000, సినిమా టికెట్లపై రూ.200 రాయితీ పొందవచ్చు. ఇక మొబిక్విక్‌ ద్వారా చెల్లింపు చేసేవారు 25శాతం వరకూ(రూ.3,000వరకూ) డిస్కౌంట్‌ లభిస్తుంది.వీటితో పాటు కొన్ని ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్‌ అందిస్తోంది. ఎంఐ మిక్స్‌2 రూ.27,999(అసలు ధర రూ.29,999), ఎంఐ మ్యాక్‌2 రూ.14,999(అసలు ధర రూ.15,999) ట్రావెల్‌ బ్యాక్‌ప్యాక్‌ రూ.1,899(ఎంఆర్‌పీ రూ.1,999), ఎంఐ ఇయర్‌ఫోన్స్‌ రూ.649(అసలు ధర రూ.699) ఎంఐ బ్యాండ్‌ 2 రూ.1,599(ఎంఆర్‌పీ రూ.1,799) అందిస్తోంది. వీటితో పాటు కాంబో ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంఐ ట్రావెల్‌ బ్యాక్‌ప్యాక్‌(రూ.1,999) సెల్ఫీ స్టిక్‌(రూ.1,099)లను రూ.2,948కే ఇవ్వనుండగా, ఎంఐ బ్యాండ్‌ హెచ్‌ఆర్‌ఎక్స్‌ ఎడిషన్‌(రూ.1,299) ఎంఐ బ్యాండ్‌ బ్లూ(రూ.199) రెండింటినీ రూ.1,398 అందించనుంది. వీటితో పాటు ఇతర గ్యాడ్జెట్స్‌పై రాయితీని, కూపన్లను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ నేటి నుండి మూడు రొజులు మాత్రమే ఉంటుంది ఆలసించిన ఆశాభంగం మీరూ ఒక లుక్కేయండి మరి.