Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటుడు, మాజీ సూపర్ మోడల్ మిలింద్ సోమన్ 52 ఏళ్ల వయసులో పెళ్లికొడుకవుతున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న తన ప్రియురాలు 23 ఏళ్ల అంకితనున మిలింద్ వివాహమాడబోతున్నారు. లేటు వయసులో పెళ్లిచేసుకుంటున్నప్పటికీ… మెహందీ వంటి ఉత్తరాది వేడుకులన్నింటినీ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం జరిగిన మెహందీ కార్యక్రమంలో కాబోయే దంపతులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొని సందడిగా గడిపారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ముంబైలోని అలీబాగ్ రిసార్ట్ లో పెళ్లి జరగనుంది. మిలింద్, అంకిత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరు తరచుగా తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. అయితే వయసులో తన కన్నా చాలా ఏళ్లు చిన్నదైన అంకితతో మిలింద్ డేటింగ్ లో ఉండడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ఏమాత్రం సరైనది కాదని హితవుపలికారు. కానీ మిలింద్, అంకిత మాత్రం ఈ విమర్శలను పట్టించుకోలేదు. అటు డబ్బు విషయంలో గొడవలు కారణంగా మిలింద్, అంకిత విడిపోయారని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఖండించేందుకు మిలింద్, అంకిత వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతోవారిపై వచ్చిన వదంతులకు తెరపడింది.