పవన్‌కు శ్రీనిరాజు లీగల్‌ నోటీసులు

Srini Raju Legal Notices to Pawan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ కళ్యాణ్‌ మీడియాపై, తెలుగు దేశం నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. టీవీ9లో అధిక శాతం వాటా ఉన్న శ్రీనిరాజు తనపై కక్ష సాధిస్తున్నాడు అంటూ పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నారా లోకేష్‌ మరియు ఆయన స్నేహితుడి వద్ద పది కోట్ల రూపాయలు తీసుకుని మరీ తనపై, తన తల్లిపై తప్పుడు ప్రచారం చేయడం జరిగిందంటూ పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్స్‌ చేశాడు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్‌ మీడియాలో సంచలనంగా ఈ విషయం ప్రచారం జరిగింది. తాను లీగల్‌గా చర్యలు తీసుకోబోతున్నట్లుగా పవన్‌ ప్రకటించిన నేపథ్యంలో పవన్‌కంటే ముందే శ్రీనిరాజు లీగల్‌ నోటీసులు పంపించడం జరిగింది.

తన క్లెయింట్‌ శ్రీనిరాజును అనవసరంగా వివాదంలోకి లాగారు అంటూ పవన్‌ కళ్యాణ్‌కు లాయర్‌ నోటీసులు పంపించాడు. వెంటనే ఈ విషయమై స్పందన తెలియజేయాలని, లేదంటే తాము తీసుకోబోతున్న చట్టపరమైన చర్యలకు సిద్దం అవ్వాలి అంటూ పవన్‌ కళ్యాణ్‌కు ఆ నోటీసులో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. శ్రీనిరాజు హఠాత్తుగా లీగల్‌ నోటీసులు ఇవ్వడం పట్ల మెగా వర్గాల వారు సైతం షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ సైతం లీగల్‌గా చర్యు తీసుకునేందుకు సిద్దం అవుతున్నాడు. శ్రీనిరాజు పంపించిన లీగల్‌ నోటీసులకు పవన్‌ ఎలా రిప్లై ఇస్తాడు అనేది ఆసక్తిరంగా ఉంది.