కేసీఆర్ ని గుడ్డి మామా తో పోల్చిన ఒవైసీ – వివరాలివిగో

Mim Leader Assaduddin Owaisi Sensational Comments On Trs

తెలంగాణలో తెరాస పార్టీకి, మజ్లిస్ పార్టీకి మధ్య గల మైత్రి అందరికి తెలిసిందే. కేసీఆర్ మజ్లిస్ పార్టీ నేతలకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో కూడా విధితమే. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న కేసీఆర్ మజ్లిస్ పార్టీతో మరింతగా కలిసి, ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాము పోటీచేయని ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో కేసీఆర్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయాలని మజ్లిస్ పార్టీ నేతలు తమ ప్రచారాలలో ప్రజలను కోరుతున్నారు. “తెలంగాణాలో ఎవరు సీఎం అయినా సరే ఎంఐఎం ముందు తలదించాల్సిందే, మా మాట ని శిరసావహించాల్సిందే అది గతంలోని చంద్రబాబు నాయుడైన, వైస్సార్ అయినా, కిరణ్ కుమార్ రెడ్డయినా, ఇప్పటి కేసీఆర్ అయినా సరే” అని గత శుక్రవారం రోజున ఎంఐఎం నేత మరియు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఎంత దూమారాన్ని లేపాయో తెలిసిన విషయమే.

Assaduddin-Owaisi-kcr

ఇదేకాకుండా, ఎవరిని సీఎం సీట్లో కూర్చోపెట్టాలో నిర్ణయించగల సత్తా ఎంఐఎం పార్టీ కి ఉందని, కేసీఆర్ అయినా ఇంకెవరైనా సరే తమ ముందు తోక జాడించి, తమ నీడకి గొడుగు పట్టాల్సిందేనని, తమ మాటని కేసీఆర్ జవదాటరనే విషయం అందరికి తెలిసిన నిజమే అని తన ప్రసంగంని వివాదాస్పదం చేశారు.నిన్న మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్ హబీబ్ ఫాతిమా నగర్, సంజయ్ నగర్ చౌరస్తాలో ప్రచారం నిర్వహించిన ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాబోతున్న ఎన్నికల్లో ప్రజకూటమికి, బీజేపీ పార్టీ కి ప్రజలు బుద్ధి చెప్పి, రాష్ట్రంనుండి సాగనంపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మైనార్టీలకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చేసిందని, 236 మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల్ని ఏర్పాటుచేసి, ఒక విద్యార్థికి 1.20 లక్షల చొప్పున 50 వేల మంది విద్యార్థులను చదివిస్తుందని, ఏమి చేయని లేని మామ కంటే కాస్తో చేస్తూ ఉన్న గుడ్డి మామ మేలు కదా తెరాస పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు మైనార్టీలకు వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నాయని, హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీ పోటీచేయని నియోజకవర్గాల్లో తాము మద్దతిస్తున్న తెరాస పార్టీకి ప్రజలు అనుకూలంగా ఓట్లు వేసి గెలిపించాలని, తెరాస పార్టీ గెలిచినా కార్ స్టీరింగ్ మొత్తం మన మజ్లిస్ పార్టీ చేతుల్లోనే ఉంటుందని, ఎంచక్కా కార్ లో కూర్చొని, హాయిగా షికారు కి వెళ్ళిరావొచ్చని చమత్కరించారు.

Kothagudem Constituency Review