జగన్ ఇంట్లో చిచ్చుపెట్టిన మంత్రి.

minister-adinarayana-reddy-counter-attacks-on-ys-jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద్యాల ఉపఎన్నికల ఫలితం తరువాత వైసీపీ కి పెను సవాళ్లు ఎదురు అవుతున్నాయి. ఇన్నాళ్లు కంచుకోట అనుకున్న రాయలసీమలోనూ వైసీపీ బీటలు వారుతోంది. చివరకు సొంత జిల్లా కడపలోనూ వైసీపీ పరిస్థితి దిగజారుతోంది. ఇందుకు ప్రధాన కారణం వైసీపీ నుంచి టీడీపీ లో చేరి మంత్రిగా కొనసాగుతున్న ఆదినారాయణ రెడ్డి అని జగన్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు మంత్రి ఆదినారాయణ రెడ్డి మీద పగతో రగిలిపోతున్నారు. ఆయన్ని ఎలాగైనా జమ్ములమడుగులో ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని కంకణం కట్టుకున్నారు.అయితే జగన్ అనుకున్నట్టు జమ్ములమడుగులో అది తరువాత వైసీపీ కి గట్టి అభ్యర్థి దొరకలేదు. టీడీపీ నేత రామసుబ్బారెడ్డికి వల వేసినా అది ఫలించలేదు. దీంతో ఓ కొత్త అభ్యర్థిని అక్కడ బరిలో దింపడానికి జగన్ డిసైడ్ అయ్యారు. ఆ కొత్త అభ్యర్థి యమా స్ట్రాంగ్ అయి వుండాలని కూడా జగన్ కోరుకున్నారు. ఆ టైం లో బాబాయ్ వివేకానంద రెడ్డి జమ్ములమడుగు అభ్యర్థి అయితే బాగుండని జగన్ అనుకున్నారు.

జగన్ తన అభిప్రాయాన్ని సన్నిహితుల ద్వారా బాబాయ్ వివేకాకు చెప్పించారు. దీంతో వివేకా షాక్ తిన్నారట. తనను పార్టీ లోకి పిలిచేటప్పుడు వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు వైసీపీ అత్యంత బలహీనంగా వున్న అమ్ములమడుగుకి వెళ్ళమనడం మీద ఫైర్ అయిపోయారట. అవసరం అయితే పార్టీ నుంచి వైదొలగడానికి కూడా రెడీ అన్నట్టు మధ్యవర్తులతో చెప్పారట. దీంతో జగన్ కంగుతిన్నారట. అది మీద ప్రతిగీకారం తీర్చుకోవాలని తాను గట్టి అభ్యర్థిగా బాబాయ్ ని భావిస్తే ఆయన ఇలా రివర్స్ కావడంతో జగన్ అప్ సెట్ అయ్యారట. మొత్తానికి కడపలో మంత్రి ఆదినారాయణరెడ్డి వైసీపీ అధినేత జగన్ కి అన్నివిధాలుగా తలనొప్పి తెప్పిస్తున్నారు. చివరికి జగన్ ఇంట్లో కూడా చిచ్చు పెట్టేసారు.