తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి జోగు రామన్న ఈరోజు ఉదయం మంచిర్యాలకు వచ్చారు. అయితే ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత ఇతర విభాగాలను పరిశీలించేందుకు మంత్రి లిఫ్ట్‌లో వెళ్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపడింది. అయితే అదృష్టం కొద్దీ ఈ ప్రమాదంలో జోగు రామన్నకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన మంత్రి, మిగతా కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొన్నారు. సామర్ధ్యానికి మించి ఎక్కువ మంది లిఫ్ట్‌లో ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంత్రికి ఎటువంటి గాయాలూ కాకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.