మహాకుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతులు…

మహాకుంభమేళాలో మంత్రి లోకేష్
మహాకుంభమేళాలో మంత్రి లోకేష్

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాని మోదీ నుంచి వీఐపీలు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఇలా ఎంతో మంది పుణ్యస్నానాలు చేశారు. తాజాగా ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు కూడా మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు లోకేష్ దంపతులు. ఆపై పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం, హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాదిమంది నమ్మకం. కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి వెళ్లారు.