Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మన దేశం ఎటు పోతోంది, దేశాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తానని గద్దెనెక్కిన మోడీ రేప్ ల విషయంలో మాత్రం అభివృద్ధి చూపిస్తున్నాడు. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్క ప్రకారం 2016 లో రోజుకి సరాసరిన 106 రేప్ లు జరిగాయట. అందులోనూ ప్రతి పది మంది లోను నలుగు మైనర్ లే ఉండటం మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. సొంత బంధువుల వద్ద, అంతెందుకు సొంత తండ్రి దగ్గరే ఆడపిల్లకి రక్షణ కరువయితే ఇంకెక్కడా వారికి రక్షణ. చిన్న పిల్లల మీద లైంగిక దాడి చేస్తున్న వారికి మరణదండన విధించిన కేంద్రం ఆ 12 ఏళ్ల పైబడిన వారిని రేప్ చేసుకోమని చేబుతున్నట్టా. ఇక్కడ గల్ఫ్ తరహా దండనలు వచ్చినప్పుడే మన దగ్గరి మగాళ్ళు…సారీ మృగాళ్ళు మారతారేమో ?
ఎక్కడో అడవుల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో లైంగిక దాడులు జరుగుతున్నాయి అంటే అనుకోవచ్చు నలుగురు తిరిగే ప్రదేశాల్లో జరుగుతుంటే వాటిని ఆపల్సింది పోయి వీడియో తీసే దౌర్భాగ్య స్తితికి చేరింది మన దౌర్భాగ్య సమాజం. మొన్నటికి మొన్న కధువా లో ఎనిమిదేళ్ళ బాలిక, తర్వాత ఉన్నావ్ లో ఘటన తాజాగా బిహార్ లో నడిరోడ్డు మీద బరితెగించి బాలిక మీద పడ్డ విజుయల్స్. ఇవన్నీ మీడియా వరకు వచ్చినవే కానీ మీడియా వరకు రాణి కొన్ని వేల కేసులు స్థానిక పెద్ద మనుషులుగా చెలామణీ అయ్యే కొందరి జేబులు నిండాక కనుమరుగయి పోతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది.
హైదరాబాద్ లోని ఓ థియేటర్లో నీళ్ల కోసం వెళ్లిన ఓ బాలికను ధియేటర్లో పని చేసే సిబ్బంది ఒకరు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంగారెడ్డికి చెందిన 14 ఏళ్ల బాలిక సిటీకి వచ్చి బోరబండలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న అన్నా వదినల వద్ద ఉంటోంది. గుడిసెల్లో నివసించే వీరు రోజువారీ నీళ్ల అవసరాల కోసం తమకు ఎదురుగా ఉన్న విజేత థియేటర్ యాజమాన్యాన్ని బ్రతిమలాడి తెచ్చుకుంటుంటారు. ఎప్పటిలానే మంగళవారం ఉదయం బాలిక నీటి కోసం థియేటర్లోకి వెళ్లింది. ఎప్పటి నుండో సదరు బాలిక మీద కన్నేసిన అక్కడ పని చేసే ప్రశాంత్ అనే దుర్మార్గుడు నీళ్లు పట్టిస్తానంటూ చెప్పి బాలికను సెల్లార్ లోకి తీసుకెళ్లాడు.
అక్కడ ఎవరు లేని కారణంగా ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి… లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెని బాత్రూంలోనికి తోసేసిబయట గడియపెట్టి ఏమీ తెలీనట్లు బయటకు వచ్చేశాడు. అయితే నీళ్ల కోసం థియేటర్లోకి వెళ్లిన బాలిక ఎంతకూ రాకపోవటంతో బంధువులు థియేటర్లోకి వెళ్లగా కనపడక పోవడంతో థియేటరు మొత్తం వెతికారు. కానీ కనపడలేదు బాత్ రూములో చూస్తే స్పృహతప్పి పడివుంది. విషయం తెలుసుకున్న వారు బాధితులు పోలీసుల వద్దకు వెళ్లగా… అక్కడ రాజీ కోసం రాయబేరాలు జరిగినట్లుగా చెబుతున్నారు.
బాధితురాలు పేదింటి అమ్మాయి కావటంతో ఈ విషయం బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే కొందరు రాజకీయ నాయకులు తమదైన స్టైల్ లో సెటిల్ మెంట్ చేయాలని ప్రయత్నించారు. అయితే… ఈ విషయం బయటకు పొక్కి మీడియా రంగప్రవేశం చేయటంతో సీన్ మారింది. మీడియా రంగప్రవేశంతో నిందితుడిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సీసీ పుటేజీని పరిశీలించగా ప్రశాంత్ బాలిక చేతులు పట్టుకొని సెల్లార్‌లోకి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. తనపై లైంగిక దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులకు బాలిక చూపించింది. నిందితుడిపై ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకొని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కొండాపూర్‌లోని విశ్వాస్ సెంటర్‌కు తరలించారు.