Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో కక్షలుండవు… కార్పణ్యాలుండవు… ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని, మేం అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవడం అగ్రిమెంట్’… ఇదీ ఇటీవల విడుదలైన ‘భరత్ అనే నేను’ మూవీలోని డైలాగ్. సినిమా సంగతి పక్కన పెడితే కాస్త అటూ ఇటుగా పాలిటిక్స్ అంటే ఇదే అనే అర్ధం వచ్చేలా చేసాయి నిన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు. నిన్నటి వరకు అల్లం అయిన పవన్ సడన్ గా ఆమెకి బెల్లంలా కనపడినట్టున్నాడు. పవన్ వెనుక బీజేపీ-వైసీపీల రహస్య కూటమి ఉందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్న తరుణంలో రోజా పవన్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు అత్యంత అవినీతి పరుడుగా విమర్శించిన జగన్ ని మర్చిపోయిన పవన్ ఇప్పుడు చంద్రబాబు లోకేష్ లని అవినీతి పరులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
టీడీపీ నేతలు కొందరు విమర్శించినట్టుగానే వైసీపి, జనసేన, బీజేపీ ల బందం గురించి బయట పడుతోంది… ఆమె తాజా వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. పవన్ కు రోజా సపోర్ట్ చేయడం వెనుక ఆంతర్యం టీడీపీని ఒంటరిని చేసి బీజేపీ-జనసేన-వైసేపీల కూటమి అధికారం చేజిక్కించుకోవడం అనేది తేటతెల్లం అవుతోంది. రోజా అప్పట్లో పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసింది… అన్న ప్రజారాజ్యంలాగానే తమ్ముడూ అమావాస్య చంద్రుడని, మరో మారు చిరంజీవిని విమర్శిస్తూ నీ తమ్ముడు ఇండస్ట్రీలో ఎంత మందితో పడుకున్నాడో శ్వేత పత్రం విడుదల చేస్తారా అని రోజా నీతి బాహ్యమైన విమర్శలు చేసారు రోజా అప్పట్లో. అలాంటి పవన్ మీద ఇంత సడన్గా ప్రేమ పుట్టుకురావడానికి కారణం అందరికి అర్ధం అవుతోంది.
తిరుమల వెంకన్నను దర్శించుకున్న రోజా పవన్ కు పూర్తి సపోర్టుగా మాట్లాడి ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన ఆమె… టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. సొంత లాభం కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేయడం మంచిది కాదని పవన్ ను రాజకీయంగా విమర్శలు చేయవచ్చు కానీ… కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని… పవన్ ను కుట్రపన్ని బజారున లాగుతున్నారని… కొన్ని చానల్స్ తో ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని రోజా వ్యాఖ్యానించారు. ఇలా రోజా పవన్ పై సానుకూలంగా మాట్లాడి అందరినీ విస్మయానికి గురిచేసింది. వ్యక్తిగతంగా ఎవరినైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని… పార్టీలను కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతుందని అయితే పవన్ వ్యక్తిత్వాన్ని బ్లేమ్ చేయడం వెనుక వైసీపీ ఉందని శ్రీరెడ్డి వంటివారు, మీడియా ప్రచారం చేస్తున్న తరుణంలో తమకేమీ సంబంధం లేదని చెప్పే ప్రయత్నంలో వైసీపీ ఉంది. అందుకే మొన్న అంబటి రాంబాబు నిన్న రోజా పవన్ ను వెనుకేసుకుని వచ్చారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.