కడియం శ్రీహరికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జై కొట్టారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధిగా కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్లను మొన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏకంగా 115 అసెంబ్లీ టికెట్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ఈ లిస్ట్ లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు గల్లంతు అయింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్‌ను కడియం శ్రీహరికి సీఎం కేసీఆర్ ఇచ్చారు . గత కొన్ని రోజులుగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై వస్తున్న ఆరోపణలు.. సర్పంచ్ నవ్య వివాదం తరుణంలోనే…. ఆయనకు టికెట్ ఇవ్వకుండా… స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్‌ను కడియం శ్రీహరికి సీఎం కేసీఆర్ ఇచ్చారు. దీంతో.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. తాజగా కేటీఆర్ రంగంలోకి దిగడంతో…కడియం శ్రీహరికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జై కొట్టారు.