రెండు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్నా ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.రెండు ప్రపంచకప్‌లు ఇండియా కి అందించిన ధోని అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా యుగోవ్ సంస్థ నిర్వహించిన సర్వే లో నిలిచాడు.
ఎక్కువ ప్రజాదరణ కలిగిన భారతీయుడిగా మొదటి స్థానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు.
మొత్తం 42,000 మందిపై యుగోవ్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది.సర్వేలో ప్రధాన మంత్రికి 15.66% ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో మహేంద్రసింగ్ ధోనీ కి 8.58%, మూడవ స్థానంలో రతన్ టాటా కి 8.02%, నాలుగవ స్థానంలో సినిమా హీరో అమితాబ్ బచ్చన్ కి 6.55% తర్వాత టెండూల్కర్ కి 5.81% మరియు విరాట్ కోహ్లి 4.46% ఓట్లు వచ్చాయి.సచిన్ టెండూల్కర్ , విరాట్ కోహ్లి 5, 6 స్థానంలో ఉన్నారు.
క్రికెటర్‌కి దూరంగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ధోనికి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ ఎన్ని విజయాలు సాధించారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు,ఎన్నో రికార్డ్స్ ని తిరగరాసిన కోహ్లీ కూడా ధోనీ కన్నా వెనక స్థానంలో ఉన్నారు.