కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఏప్రిల్ 14 న లాక్ డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదు అని భారత దేశ్ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే ఒకేసారి ఈ లాక్ డౌన్ ఎత్తి వేయలేం అని, అయితే ఈ విషయం పై వస్తున్న సలహాలు అన్నిటినీ పరిగణన లోకి తీసుకుంటున్నాం అని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర ముఖ్య మంత్రులతో చర్చిస్తాం అని అన్నారు. అయితే మానవాళి మనుగడ కు సవాల్ గా పరిణమించిన కరోనా వైరస్ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే లాక్ డౌన్ ఎత్తివేత గడువు సమీపిస్తుండటంతో నరేంద్ర మోడీ దీని పై చర్చలు జరిపారు.
అయితే కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు మారిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అదుపులోకి వచ్చినా, ఇపుడు ఎత్తివేస్తే ప్రి కరోనా పోస్ట్ కరోనా అన్నట్లుగా ఉంది అని అన్నారు. అయితే సామాజిక, వ్యక్తిగత ప్రవర్తన లో మార్పులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సమయంలో ముఖ్యమంత్రుల తో చర్చలు జరిపి, ప్రతి పక్షాల టీ చర్చలు జరిపి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ లాక్ డౌన్ వచ్చే నెల మే 11 వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రధాని ఈ విషయం ఎపుడు అధికారికంగా ప్రకటిస్తా రో వేచి వేచి చూడాలి.