విశ్వమంతా విలయ తాండవం చేస్తున్న కోరనా మహమ్మారిపై ప్రజలను ప్రభుత్వాలు నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు కేంద్రప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు చేపడుతోంది. ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కరోనా నివారణకు మార్గదర్శకాలను అందిస్తొంది. విలువైన సూచనలు సలహాలిస్తూ కరోనాపై పోరు సాగిస్తోంది. కోవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ 27వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ నేపధ్యంలో సీఎంలతో మోడీ మూడో వీడియో కన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ లతో ప్రధాని ఈ నెల 24వ తేదీన వీడియో లింక్ ద్వారా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మేమూడు వరకు లాక్ డౌన్ పొడిగించింది. పలు రాష్ట్రాల్లో పాక్షిక మినహాయింపుల తప్ప ఎక్కడా సడలింపు నివ్వలేదు. లాక్ డౌన్ రెండో సారి పొడిగించిన నేపథ్యంలో మోడీ నిర్వహిస్తున్న సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపును మోడీ సమీక్షించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కరవు నివారణకు తీసుకుంటున్న చర్యలను మోడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రులకు దిశా నిర్దేశం చేయడంతో పాటు సీఎంల సలహాలు ప్రధాని కూడా స్వీకరించనున్నట్లు వెల్లడిస్తున్నారు.
ఈ సందర్భంగా మోదీ స్వామి పథకాన్ని ప్రారంభించడంతో పాటు ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ మొబైల్ ఆప్ ను ఆవిష్కరించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో నివాస ప్రాంతాన్ని గుర్తించడమే స్వామితో పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్ డౌన్ విధించడంతో పాటు పరీక్షలు విస్తృతంగా చేపట్టడం వంటి చర్యలు అమలు చేస్తున్న మోడీపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తోన్న మోడీకి కృతజ్ఞతలు చెప్తూ.. ఆయన ప్రధానికి లేఖ రాశారు. మరోవైపు కోవిడ్ ను ఎదుర్కోవడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే ముందు వరుసలో నిలిచారు.
ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో అరవై ఎనిమిది పాయింట్ లతో మోదీ అగ్రస్థానాన్ని ఆక్రమించారు. మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఉబర్ ఉడా 36 పాయింట్ లతో రెండో స్థానంలో నిలిచారు. 35 పాయింట్ లతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడో స్థానంలో నిలవగా.. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిలిచారు. కాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ ప్రధాని షింజో అబె కరోనా నివారణ చర్యల్లో అట్టడుగు స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.